Chinna Trailer : ఆకట్టుకుంటున్న సిద్దార్థ్ ‘చిన్నా’ ట్రైలర్..
సిద్దార్థ్ (Siddharth) హీరోగా నటిస్తున్న చిత్రం చిన్నా (Chinna). అరుణ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిమిషా సజయన్ హీరోయిన్.

Chinna Trailer
Siddharth Chinna Trailer : సిద్దార్థ్ (Siddharth) హీరోగా నటిస్తున్న చిత్రం చిన్నా (Chinna). అరుణ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిమిషా సజయన్ హీరోయిన్. ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోండగా ఏషియన్ సినిమాస్ ద్వారా తెలుగులో విడుదల అవుతోంది. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తుండగా అక్టోబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. మేనమామకి, మేనకోడలికి మధ్య ఉన్న అందమైన అనుబంధాన్ని ఈ చిత్రంలో చూపించినట్లు అర్థం అవుతోంది. మేనకోడలు తప్పిపోవడంతో ఆమె కోసం తపన పడే పాత్రలో సిద్దార్థ్ నటించారు. మరి తప్పిపోయిన మేనకోడలు దొరికిందా..? లేదా..? సిద్దార్థ్ ఎవరినో ఎందుకు చంపాలని అనుకుంటున్నాడో తెలియాలంటే..? సినిమా చూడాల్సిందే.
Skanda Collections : రెండో రోజు ‘స్కంద’కు ఊహించని కలెక్షన్స్..