Takkar Teaser : దివ్యాంశ కౌశిక్‌‌తో సిద్దార్థ్ రొమాన్స్ మాములుగా లేదుగా..

ఈరోజు సిద్దార్థ్ పుట్టినరోజు సందర్భంగా తన నటిస్తున్న సినిమాలు నుంచి కూడా పోస్టర్స్ అండ్ టీజర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిద్దార్థ్ నటించిన టక్కర్‌ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ చేశారు.

Takkar Teaser : దివ్యాంశ కౌశిక్‌‌తో సిద్దార్థ్ రొమాన్స్ మాములుగా లేదుగా..

Siddharth Divyansha Kaushik Takkar movie Teaser released

Updated On : April 17, 2023 / 7:38 PM IST

Takkar Teaser : లవర్ బాయ్ సిద్దార్థ్ (Siddharth) టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడే సినిమాలు చేస్తున్నాడు. అడపాదడపా తెలుగు సినిమాలో కనిపిస్తున్నాడు. చివరిగా తెలుగులో శర్వానంద్ తో కలిసి మహాసముద్రం సినిమాలో నటించాడు. కాగా నేడు సిద్దార్థ్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియా వేదికగా అందరూ విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సిద్దార్థ్ గర్ల్ ఫ్రెండ్ అదితి రావు (Aditi Rao Hydari) కూడా ఎమోషనల్ పోస్ట్ వేసి బర్త్ డే విషెస్ చెప్పింది. ఇక ఈ పుట్టినరోజు సందర్భంగా సిద్దార్థ్ నటిస్తున్న సినిమాలు నుంచి కూడా పోస్టర్స్ అండ్ టీజర్స్ రిలీజ్ చేస్తున్నారు.

Siddharth – Aditi : సిద్దార్థ్‌కి అదితి బర్త్ డే విషెస్.. వైరల్ అవుతున్న ఇన్‌స్టా రీల్!

ఈ క్రమంలోనే సిద్దార్థ్ నటించిన టక్కర్‌ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఇప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాలు వల్ల విడుదల కాలేకపోయింది. ట్రాష్ లోకి వెళ్లిపోయింది అనుకున్న ఈ మూవీ టీజర్ ని ఇప్పుడు రిలీజ్ చేసి అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్‌‌ (Divyansha Kaushik) నటించింది. ప్రేమ అంటే నమ్మకం లేని ఒక డబ్బు ఉన్న హీరోయిన్‌ని పేదవాడు అయిన హీరో ప్రేమించడం అనే లైన్ తో ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఇక ఈ టీజర్ లో దివ్యాంశ కౌశిక్‌‌తో సిద్దార్థ్ రొమాన్స్ మాములుగా లేదు.

యూత్ ని ఆకట్టుకునేలా ఉన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించడం గమనార్హం. నివాస్ కే ప్రసన్న సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ కానుకగా మే 26న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. కాగా సిద్దార్థ్ నటిస్తున్న మరో సినిమా ఇండియన్ 2 (Indian 2). శంకర్, కమల్ హాసన్ కలయికలో వస్తున్న ఈ మూవీలో సిద్దార్థ్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.