Aditi Rao Hydari – Siddharth : ఒరే బాబు.. మేము సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకోలేదు.. పెళ్లి ఎప్పుడంటే..

తాజాగా సిద్దార్థ్ ఓ ఈవెంట్ కి వెళ్లగా అక్కడ అందరూ ఈ నిశ్చితార్థం గురించే అడిగారు. సీక్రెట్ గా ఎందుకు చేసుకున్నారు అంటూ ప్రశ్నించారు.

Aditi Rao Hydari – Siddharth : ఒరే బాబు.. మేము సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకోలేదు.. పెళ్లి ఎప్పుడంటే..

Siddharth Gives Clarity on Secret Engagement With Aditi Rao Hydari

Updated On : April 8, 2024 / 10:38 AM IST

Siddharth – Aditi Rao Hydari : హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి ప్రేమ, డేటింగ్ పై అనేక వార్తలు వచ్చినా స్పందించలేదు. కానీ వీరిద్దరూ లవ్ కపుల్ అని అందరికి అర్థమైంది. ఇటీవల మార్చి 27న తెలంగాణలోని వనపర్తిలో ఓ ఆలయంలో వీరి వివాహం జరిగిందని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అదితి, సిద్దార్థ్ లు కొత్త ఉంగరాలతో దిగిన సెల్ఫీ పోస్ట్ చేసి ఎంగేజ్మెంట్ జరిగిందని తెలిపారు. దీంతో వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు, నిశ్చితార్థం చేసుకున్నారు అని వార్తలు వచ్చాయి.

తాజాగా సిద్దార్థ్ ఓ ఈవెంట్ కి వెళ్లగా అక్కడ అందరూ ఈ నిశ్చితార్థం గురించే అడిగారు. సీక్రెట్ గా ఎందుకు చేసుకున్నారు అంటూ ప్రశ్నించారు. దీనికి సిద్దార్థ సమాధానమిస్తూ.. మేము సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకోలేదు. ప్రైవేట్ గా చేసుకున్నాము. ఎవరికీ చెప్పకుండా సడెన్ గా ఎక్కడికో వెళ్ళిపోయి చేసుకుంటే సీక్రెట్ అనాలి. కానీ మేము మా కుటుంబ సభ్యులు, సన్నిహతుల మధ్య సింపుల్ గా ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ప్రైవేట్ గా చేసుకున్నాం నిశ్చితార్థాన్ని. అలాంటప్పుడు అది సీక్రెట్ నిశ్చితార్థం ఎలా అవుతుంది అని తెలిపాడు.

Also Read : Tamannaah Bhatia : ఇప్పటికి ఇంత అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి కారణం చెప్పిన తమన్నా.. తమన్నా డైలీ రొటీన్ తెలుసా?

ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.. పెళ్లి విషయం మా పెద్దలు చూసుకుంటారు. మాకు ఎప్పుడైనా ఓకే. పెద్దవాళ్ళు ముహుర్తాలు చూసి ఓ మంచిరోజు చెప్తారు. అప్పుడే మేము పెళ్లి చేసుకుంటాము అని తెలిపాడు. దీంతో సిద్దార్థ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.