Tamannaah Bhatia : ఇప్పటికి ఇంత అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి కారణం చెప్పిన తమన్నా.. తమన్నా డైలీ రొటీన్ తెలుసా?
తాజాగా తమన్నా తన డైలీ రొటీన్, తాను తినే ఫుడ్ గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

Tamannaah Bhatia shares her Daily Routine her Food and Exercise Details
Tamannaah Bhatia : తమన్నా భాటియా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు దాటేసిన ఇంకా హీరోయిన్ గా, మెయిన్ లీడ్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవలే తన ప్రేమని కూడా బయటపెట్టింది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉంది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది. తమన్నా 35 ఏళ్ళు వచ్చినా ఇంకా అంతే అందంతో, అంతే ఆరోగ్యంతో ఉండటానికి తన డైలీ రొటీన్ కారణమంటూ తెలిపింది.
తాజాగా తమన్నా తన డైలీ రొటీన్, తాను తినే ఫుడ్ గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తమన్నా తన డైలీ రొటీన్ గురించి మాట్లాడుతూ.. ఎంత బిజీగా ఉన్నా ఉదయం యోగా, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, కార్డియో.. లాంటివి కనీసం గంటసేపైనా చేస్తాను. ఉదయం నానబెట్టిన బాదంపప్పులతో నా డైట్ ప్రారంభం అవుతుంది. బ్రేక్ ఫాస్ట్ లోకి ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఆహరం తీసుకుంటాను. లంచ్ లోకి పప్పు, బ్రౌన్ రైస్, ఉడికించిన కూరగాయముక్కలు, కూరలు తింటాను. సాయంత్రం జ్యూస్ లు తాగుతాను. రాత్రికి మిల్లెట్స్ తో చేసిన స్నాక్స్ తింటాను. రోజులో వాటర్, జ్యూస్ ఎక్కువగా తాగుతాను. అలాగే రోజులో ఒక అరగంటైనా వాకింగ్ ఉండేలా చూసుకుంటాను అని తెలిపింది.
Also Read : Arjun – Akhil – Akira : ఈ ముగ్గురు బర్త్ డేలు ఇవాళే అని తెలుసా? ముగ్గురు A తోనే మొదలు..
అలాగే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటాను అని, మనసు ఆనందంగా అంటే ఇంకా ఆరోగ్యంగా ఉంటామని తెలిపింది. మీరు కూడా తమన్నా డైట్ ఫాలో అయి అందంగా ఆరోగ్యంగా ఉండండి.