Sharwanand – Siddharth : శర్వానంద్ పెళ్లిలో సిద్దార్థ్ మ్యూజికల్ కాన్సర్ట్.. వీడియో వైరల్!
శర్వానంద్ పెళ్ళిలో హీరో సిద్దార్థ్ మ్యూజికల్ కాన్సర్ట్ ఇచ్చి అదరగొట్టేశాడు. ఓయ్ ఓయ్ అంటూ పాడుతూ వెడ్డింగ్ లోని అతిథులందర్నీ ఎంటర్టైన్ చేశాడు.

Siddharth singing video at Sharwanand wedding is gone viral
Sharwanand – Siddharth : టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో జరిగిన ఈ వివాహానికి టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సిద్దార్థ్, అదితిరావు హైదరి (Aditi Rao Hydari) తదితరులు పెళ్ళిలో సందడి చేశారు. రెండు రోజులు పాటు జరిగిన ఆ పెళ్లి సంబరంలో మ్యూజికల్ కాన్సర్ట్ ని కూడా నిర్వహించారు. ఇక ఆ మ్యూజికల్ నైట్ లో స్టేజి పై కొందరు సింగర్స్ సిద్దార్థ్ నటించిన ఓ సినిమాలోని పాట పాడారు.
Tamannah: ప్రేమించుకుంటున్నారా..? సిరీస్ కోసమే కలిసి ప్రయాణమా..?
అయితే స్టేజి కింద ఉన్న సిద్దార్థ్ పైకి వచ్చి మైక్ పట్టుకొని ఆ పాట పాడి అదరగొట్టేశాడు. ‘ఓయ్’ సినిమాలోని ‘ఓయ్ ఓయ్’ అనే సాంగ్ సిద్దార్థ్ పాడుతుంటే వెడ్డింగ్ లోని గెస్ట్స్ అంతా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ పెళ్లి వేడుకకు సిద్దార్థ్, అదితిరావు కలిసి రావడంతో మరోసారి వీరిద్దరి ప్రేమవార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లి వేడుక అనంతరం సిద్దార్థ్.. అదితితో కలిసి జైపూర్ దగ్గర వేరే ఊర్లో ఉంటున్న అదితి చుట్టాలింటికి వెళ్ళాడు.
ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రతి చోట ఇలా జంటగా కలిసి కనిపిస్తున్న వీరిద్దర్నీ ప్రేమలో ఉన్నారా? అని ప్రశ్నిస్తే మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. శర్వానంద్ అండ్ సిద్దార్థ్ కాంబినేషన్ లో వచ్చిన మహా సముద్రం (Maha Samudram) సినిమాలో అదితి.. సిద్దార్థ్ తో కలిసి పని చేసింది. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి.
Siddharth singing Oye Oye in Sharwanand Wedding👌🏻 pic.twitter.com/ZBzeacu1io
— Johnnie Walker (@roopezh) June 6, 2023