Jack Trailer : సిద్దు జొన్నలగడ్డ ‘జాక్’ ట్రైలర్.. యాక్షన్, కామెడీతో అదిరిపోయింది..
సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న జాక్ చిత్ర ట్రైలర్ వచ్చేసింది.

Siddhu Jonnalagadda Jack Trailer Out now
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న మూవీ జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో కథానాయిక. హ్యారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, కిస్ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
Chiranjeevi : అనిల్ కోసం చిరు మరోసారి..!
3 నిమిషాల 7 సెకన్లు ఈ ట్రైలర్ ఉంది. ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. యాక్షన్ సన్నివేశాలు, సిద్ధు తనదైన కామెడీతో అలరించాడు. మొత్తంగా ట్రైలర్ అదిరిపోయింది.