Siddhu Jonnalagadda : బొమ్మరిల్లు సిద్దార్థ్ అనుకోని నాకు ఫోన్ చేశారు.. నేను కాదని తెలిశాక..

సిద్ధు జొన్నలగడ్డ తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటని తెలియచేశాడు షోలో. సిద్ధు ఆ సంఘటన గురించి చెప్తూ.. ''హీరోగా ట్రై చేస్తున్నప్పుడు ఒకతను నాకు కాల్ చేసి చాలా మర్యాదగా మాట్లాడాడు................

Siddhu Jonnalagadda : బొమ్మరిల్లు సిద్దార్థ్ అనుకోని నాకు ఫోన్ చేశారు.. నేను కాదని తెలిశాక..

Siddhu Jonnalagadda shares intresting fact in Unstoppable show

Updated On : October 21, 2022 / 1:51 PM IST

Siddhu Jonnalagadda :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్ షో సీజన్ 2ని ఇటీవల మొదలైంది. అన్‌స్టాపబుల్ సీజన్ 2లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో సీజన్ 2 మొదటి ఎపిసోడ్ వ్యూస్ లో సరికొత్త రికార్డుని సృష్టించింది. ఇక అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండో ఎపిసోడ్ లో యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ వచ్చారు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ హీరోలు రావడంతో ఈ ఎపిసోడ్ కూడా బాగా క్లిక్ అవుతుంది. ఈ ఎపిసోడ్ కి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా వచ్చారు. యువ హీరోలతో కలిసి బాలయ్య బాబు రచ్చ చేశారు. వాళ్ళతో కలిసి సరదాగా మాట్లాడుతూ సెటైర్స్ వేస్తూ ఎంటర్టైన్ చేశారు.

ఈ ఎపిసోడ్ లో ఇద్దరు యువ హీరోలు చాలా ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు. సిద్ధు జొన్నలగడ్డ తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటని తెలియచేశాడు షోలో. సిద్ధు ఆ సంఘటన గురించి చెప్తూ.. ”హీరోగా ట్రై చేస్తున్నప్పుడు ఒకతను నాకు కాల్ చేసి చాలా మర్యాదగా మాట్లాడాడు. సర్, మీతో నేను సినిమా తీద్దాము అనుకుంటున్నాను, మీకు కథ చెప్పాలి అనుకుంటున్నాను, టైం ఇస్తే చెప్తాను సర్ వచ్చి అన్నాడు. నాకు ఆశ్చర్యమేసింది. నేను అప్పటికి హీరో కాలేదు, అతనేమో చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు.”

Vishwaksen : అలాంటి వాళ్ళతో నాకెందుకు అని.. యాంకర్ దేవి నాగవల్లితో గొడవ గురించి అన్‌స్టాపబుల్ షోలో మాట్లాడిన విశ్వక్..

” ఒక 3,4 రోజులు ఈ ఫోన్ కాల్స్ అలాగే నడిచాయి. కలుద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. నాకెందుకో డౌట్ వచ్చింది మరీ ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తుంటే. ఒక రోజు అతను ఫోన్ చేసినప్పుడు అడిగాను మీరు నేను ఏ సిద్దార్థ్ అనుకుంటున్నారు, బొమ్మరిల్లు సిద్దార్థ్ అనుకుంటున్నారా అని అడిగాను. అతను ఔను అని చెప్పడంతో నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. నేను కాదు అని చెప్పి ఎవరో చెప్పాను. ఆ తర్వాత నుంచి అతను మళ్ళీ కాల్ చేయలేదు” అని తెలిపాడు.