Sidharth-Kiara Reception : ముంబైలో గ్రాండ్ గా సిద్దార్థ్-కియారా రిసెప్షన్.. హాజరైన బాలీవుడ్..

తాజాగా ఆదివారం నాడు ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించారు సిద్దార్థ్-కియారా జంట. బాలీవుడ్ సెలబ్రిటీల కోసం ఈ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ముంబైలోని సెయింట్ రెజిస్ హోటల్‌ సిద్దార్థ్-కియారా రిసెప్షన్ ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు...............

Sidharth-Kiara Reception : ముంబైలో గ్రాండ్ గా సిద్దార్థ్-కియారా రిసెప్షన్.. హాజరైన బాలీవుడ్..

sidharth and kiara grand reception bollywood stars attend

Updated On : February 13, 2023 / 9:03 AM IST

Sidharth-Kiara Reception :  బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్, లవ్ కపుల్ సిద్దార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ ఇటీవల ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రాజస్థాన్ జైసల్మీర్ లో వివాహం చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా ప్రేమించుకొని, డేటింగ్ చేసి అనంతరం ఇటీవలే ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్ళి చాలా తక్కువ మంది సెలబ్రిటీలు, ఇరు కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరిగింది.

తాజాగా ఆదివారం నాడు ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించారు సిద్దార్థ్-కియారా జంట. బాలీవుడ్ సెలబ్రిటీల కోసం ఈ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ముంబైలోని సెయింట్ రెజిస్ హోటల్‌ సిద్దార్థ్-కియారా రిసెప్షన్ ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ రిసెప్షన్ ఈవెంట్ లో సిద్దార్థ్ మల్హోత్రా పూర్తిగా బ్లాక్ సూట్ తో మెరవగా, కియారా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ డ్రెస్ లో అలరించింది.

Kangana Ranaut : చంద్రముఖి 2లో ఆమెని మ్యాచ్ చేయటం కష్టం అంటూ జ్యోతికని పొగిడేసిన కంగనా..

ఇక సిద్దార్థ్-కియారా రిసెప్షన్ కి ఆయుష్ శర్మ, సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్, శిల్పాశెట్టి, కరీనా కపూర్, దిశా పటాని, ఆదిత్య కపూర్, వరుణ్ ధావన్, రణవీర్ సింగ్, ఆకాష్ అంబానీ, అనుష్క రంజాన్, కాజోల్, కరణ్ జోహార్, అలియా భట్, నీతూ కపూర్, విద్యా బాలన్, అజయ్ దేవగణ్, అనుపమ్ ఖేర్, రాశి ఖన్నా, కృతి సనన్, జెనీలియా, రితేష్ దేశముఖ్, విక్కీ కౌశల్, రకుల్ ప్రీత్ సింగ్, అనన్య పాండే, నేహా ధూపియా.. ఇలా అనేక మంది సెలబ్రిటీలు హాజరయి కొత్త జంటని ఆశీర్వదించారు. ఒకేచోట ఇంతమంది స్టార్స్ ని చూడటంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఇక వీరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.