మనో పొలిటికల్ ఎంట్రీ

  • Published By: madhu ,Published On : March 10, 2019 / 09:03 AM IST
మనో పొలిటికల్ ఎంట్రీ

Updated On : March 10, 2019 / 9:03 AM IST

అదృ‌ష్టం పరీక్షించుకుందామని సినీ, క్రీడా ఇతర రంగాలకు చెందిన వారు పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంటారు. ప్రధానంగా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కొత్త పార్టీలను స్థాపించడం..ఇతర పార్టీలో చేరుతుంటారు. తాజాగా తన గాత్రంతో అలరిస్తున్న మనో (నాగూర్ బాబు) పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. మూడున్నర దశాబ్దాలుగా దక్షిణాది సినీ సంగీతాభిమాను అలరిస్తున్న ఈ గాయకుడు తమిళనాట రాజకీయ అరంగేట్రం చేశారు. మార్చి 09వ తేదీ శనివారం టీటీవీ దినకరన్‌ నేతృత్వంలోని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)లో చేరారు. తాను తెలుగు వాడినైనా తమిళనాడు రాష్ట్రంతో ఎనలేని అనుబంధం ఏర్పడిందన్నారు మనో. దినకరన్ వ్యక్తిత్వం..ఆలోచనా విధానం నచ్చి ఆయన పార్టీలో చేరినట్లు చెప్పారు. మరి ఇతను ఎన్నికల బరిలో నిలుస్తారా ? లేదా అనేది వెయిట్ అండ్ సీ.