Singer Smitha : ఆఫర్ వచ్చినా వెళ్ళను.. అదంతా టీఆర్పీ కోసమే.. బిగ్‌బాస్‌ పై ప్రముఖ సింగర్ సంచలన వ్యాఖ్యలు..

సింగర్ స్మిత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్‌ గురించి ప్రస్తావన రాగా దీనిపై మాట్లాడుతూ..''బిగ్‌బాస్‌ నాకు అస్సలు నచ్చని షో ఇది. ఒకవేళ బిగ్‌బాస్‌ ఆఫర్ నాకు వచ్చినా నో చెప్తాను. ఆ ఆఫర్ ఒప్పుకోను. కుటుంబాన్ని అన్ని రోజులు............

Singer Smitha : ఆఫర్ వచ్చినా వెళ్ళను.. అదంతా టీఆర్పీ కోసమే.. బిగ్‌బాస్‌ పై ప్రముఖ సింగర్ సంచలన వ్యాఖ్యలు..

Singer Smita Sensational comments on BiggBoss

Updated On : September 6, 2022 / 7:40 AM IST

Singer Smitha :  బిగ్‌బాస్‌ 6వ సీజన్ గ్రాండ్ గా మొదలయింది. 21 మందితో హౌస్ ని నింపేశారు. మొదటి రోజు నుంచే ఆట మొదలయింది. ఆ కంటెస్టెంట్స్ కి సపోర్ట్ గా సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యాన్స్ అప్పుడే రచ్చ మొదలు పెట్టారు. అయితే బిగ్‌బాస్‌ ని కొంతమంది సపోర్ట్ చేస్తే, మరికొంతమంది విమర్శిస్తారు. బిగ్‌బాస్‌ పై పలువురు ప్రముఖులు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికి కూడా ఈ షోని, ఈ షో కాన్సెప్ట్ ని కొంతమంది బాహాటంగానే విమర్శిస్తారు. తాజాగా ప్రముఖ సింగర్ స్మిత ఈ షో గురించి మాట్లాడింది.

సింగర్ స్మిత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్‌ గురించి ప్రస్తావన రాగా దీనిపై మాట్లాడుతూ..”బిగ్‌బాస్‌ నాకు అస్సలు నచ్చని షో ఇది. ఒకవేళ బిగ్‌బాస్‌ ఆఫర్ నాకు వచ్చినా నో చెప్తాను. ఆ ఆఫర్ ఒప్పుకోను. కుటుంబాన్ని అన్ని రోజులు వదిలి వెళ్లాల్సిన అవసరం ఏముంది. కొన్ని రోజుల పాటు సెలబ్రిటీలని ఒక ఇంట్లో పెట్టి తాళం వేసి తన్నుకోండి, గొడవపడండి అని చెప్పి వాళ్ళు టీఆర్పీలు పెంచుకోవడం ఎంతవరకు కరెక్ట్. నేను అసలు ఆ షో చూడను. చూసినా నాకు అర్ధం కాదు. నేను మాత్రం బిగ్‌బాస్‌ షోకి అస్సలు వెళ్ళను. నాకు తెల్సిన వాళ్ళు వెళ్తా అంటే ఎందుకు అని తిడతాను. ఇక వెళ్లే వాళ్ళ గురించి నేను మాట్లాడాను. అది వాళ్ళ వ్యక్తిగతం” అని తెలిపింది.

Inaya Sulthana : నాన్న చనిపోయాడు.. ఇంట్లో వాళ్ళు వదిలేశారు.. మొదటి రోజే ఏడ్చేసిన ఇనయా..

ఓ పక్కన బిగ్‌బాస్‌ మొదలయి షో టెలికాస్ట్ అవుతుంటే, అందులో సింగర్స్ కూడా వెళ్తుంటే, సెలబ్రిటీ సింగర్ అయి ఉండి స్మిత ఇలా బిగ్‌బాస్‌ కి వ్యతిరేకంగా మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.