Raghavendra Rao: సింగర్ సునీత కుమారుడికి రాఘవేంద్ర రావు ‘సర్కారు నౌకరి’!

టాలీవుడ్ పాపులర్ సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యాడు. గతంలోనే తన కొడుకుని సినిమా రంగానికి పరిచయం చేయాలనుకుంటున్నట్లుగా సునీత పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు అతడిని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ఆర్.కె. టెలీ షో పతాకంలో ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు సునీత రెడీ అయ్యారు.

Raghavendra Rao: సింగర్ సునీత కుమారుడికి రాఘవేంద్ర రావు ‘సర్కారు నౌకరి’!

Singer Sunitha Son Akash In Raghavendra Rao's Sarkaru Naukari

Updated On : January 26, 2023 / 6:58 PM IST

Raghavendra Rao: టాలీవుడ్ పాపులర్ సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యాడు. గతంలోనే తన కొడుకుని సినిమా రంగానికి పరిచయం చేయాలనుకుంటున్నట్లుగా సునీత పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు అతడిని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ఆర్.కె. టెలీ షో పతాకంలో ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు సునీత రెడీ అయ్యారు.

Raghavendra Rao : బాహుబలి రెండు పార్టులుగా తీయమని చెప్పింది నేనే.. ఖర్చు చూసి భయపడ్డాం..

తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు సునీత, రామ్ దంపతులు కూడా పాల్గొన్నారు. తమ కుమారుడిని రాఘవేంద్ర రావు చేతిలో పెడితే, అతడు మంచి నటుడిగా అవతరిస్తాడని తాము ఆశిస్తున్నట్లు సునీత తెలిపారు. కాగా ఈ సినిమాను గంగనమోని శేఖర్ అనే నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాకు ‘సర్కారు నౌకరి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో ఆకాశ్ సరసన నూతన నటి భావనా వళపండల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.