Hello Meera : సింగిల్ క్యారెక్టర్ తో సినిమా తీసిన బాపు శిష్యుడు..

గార్గేయి ఎల్లాప్రగడ ఈ సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే హలో మీరా సినిమాకు సంబంధించిన పోస్టర్స్, వీడియోస్ రిలీజ్ చేసి తన సినిమాలోని వైవిధ్యాన్ని, ప్రయోగాత్మక విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్ ఏప్రిల్ 21న ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు.

Hello Meera : సింగిల్ క్యారెక్టర్ తో సినిమా తీసిన బాపు శిష్యుడు..

single character movie Hello Meera directed by Bapu Assistant Kakarla Srinivas

Updated On : April 17, 2023 / 11:29 AM IST

Hello Meera :  భారీ భారీ డైలాగులు, అట్రాక్ట్ చేసే డ్యూయెట్స్, ఔరా అనిపించే ఫైట్ సీన్స్.. సినిమా అనగానే ఇవేకదా మనకు గుర్తొచ్చేవి. అయితే అందుకు పూర్తి భిన్నంగా ఎలాంటి ఫైట్స్, డ్యూయెట్స్ లేకుండా కేవలం సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా తీయడమంటే అది గొప్ప సాహసమే అని చెప్పుకోవాలి. ఎంతో ధైర్యం, కథపై నమ్మకం ఉంటే తప్ప అలాంటి సినిమా తీయడానికి ఏ దర్శకుడు ముందుకు రాలేరు. కానీ అదే చేసి చూపించారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్.

సినిమా అంటే పిచ్చి, వ్యామోహం.. సినిమానే జీవితం అన్నట్లుగా ముందుకు వెళుతున్న కాకర్ల శ్రీనివాస్ ఎవ్వరికీ తెలియకపోవచ్చు కానీ.. తెరవెనుక ఉండి ఎన్నో సినిమాలను విజయ తీరాలకు చేర్చిన ఘనత ఆయన సొంతం. ప్రఖ్యాత డైరెక్టర్ బాపు గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన కాకర్ల శ్రీనివాస్, బాపు చివరి సినిమా వరకు నీడలా ఆయన వెంటే ఉన్నారు. తనలోని టాలెంట్ బాపు గారితో పంచుకుంటూ గొప్ప సినిమాలకు తెర రూపమిచ్చారు.

Hello.. Meera..! (2023) | Hello.. Meera..! Movie | Hello.. Meera..! Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmiforest

అదే అనుభవాన్ని రంగరిస్తూ.. తన టాలెంట్ నేరుగా బయటపెట్టడానికి హలో మీరా అనే సినిమా రూపొందించారు కాకర్ల శ్రీనివాస్. కేవలం ఒకే ఒక్క క్యారెక్టర్‌‌తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. హలో మీరా అనే క్యాచీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు డైరెక్టర్ శ్రీనివాస్. ఒకే ఒక్క క్యారెక్టర్‌‌లో సగటు ప్రేక్షకుడికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ వెండితెరపై పండించడం అంత సులువు కాదు. కానీ తన కథ పట్ల తనకున్న అపారమైన నమ్మకంతో అలాంటి సాహసం చేస్తూ ప్రయోగాత్మక సినిమా తీశారు కాకర్ల శ్రీనివాస్.

వైవిద్యభరితమైన కథలో ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రెడీ అయ్యారు. తెరపై కేవలం ఒక అమ్మాయిని మాత్రమే చూపిస్తూ సగటు ప్రేక్షకుడి బుర్రలో బోలెడు రోల్స్ మెదిలేలా ఈ సినిమాను తెరకెక్కించడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. తెరపై కనిపించేది మీరానే అయినా వినిపించే పాత్రలన్నీ సగటు ప్రేక్షకుడి మదిలో మెదిలేలా రూపొందించారు. ప్రేమ, స్నేహం, స్నేహితులకోసం దెబ్బలు తినడం, మీడియా సమావేశంలో గొడవలూ, రౌడియిజాలూ, కొట్లాటలూ, tvలో బ్రేకింగ్ న్యూస్ అన్నీ ప్రేక్షకుడి కళ్ల ముందు కదులాడేలా జాగ్రత్త పడ్డారు.

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సరికొత్త యాడ్.. ఆ స్టార్ హీరో భామల సరసన..

గార్గేయి ఎల్లాప్రగడ ఈ సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే హలో మీరా సినిమాకు సంబంధించిన పోస్టర్స్, వీడియోస్ రిలీజ్ చేసి తన సినిమాలోని వైవిధ్యాన్ని, ప్రయోగాత్మక విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్.. ఏప్రిల్ 21న ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫైనల్ కాపీ చూసిన కొందరు ప్రముఖులు సినిమా బాగుందని అభినందిస్తున్నారు. ఈ హలో మీరా సినిమా ప్రేక్షకులకు ఎన్నడూ లేని డిఫరెంట్ అనుభూతి కలిగిస్తుందని అంటున్నారు.