Siri Hanumanthu : జవాన్ ఛాన్స్ వచ్చినప్పుడు ఫేక్ కాల్ అనుకున్నా.. అట్లీ బాగా తిట్టడంతో ఏడ్చేశా..

సిరిని జవాన్ సినిమాలో చూసినప్పుడు తెలుగువాళ్లంతా ఆశ్చర్యపోయారు. సినిమాలో షారుఖ్ - సిరి కాంబినేషన్ లో సీన్స్ కూడా ఉన్నాయి.

Siri Hanumanthu : జవాన్ ఛాన్స్ వచ్చినప్పుడు ఫేక్ కాల్ అనుకున్నా.. అట్లీ బాగా తిట్టడంతో ఏడ్చేశా..

Siri Hanumanthu Spoke about Shahrukh Khan Jawan Movie and Director Atlee

Siri Hanumanthu :  బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shahrukh Khan) ఇటీవల సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు జవాన్(Jawan) సినిమాతో వచ్చి భారీ విజయం సాధించారు. తమిళ్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి 1000 కోట్లకు దూసుకెళ్తుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా దీపికా పదుకొనే, ప్రియమణి ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో కొంతమంది అమ్మాయిల్ టీం ఉంటుంది.

జవాన్ సినిమాలోని అమ్మాయిల టీంలో మన తెలుగు యూట్యూబర్, సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంతు కూడా నటించింది. సినిమాలో కొన్ని సీన్స్ లో కనిపిస్తుంది సిరి. సిరిని జవాన్ సినిమాలో చూసినప్పుడు తెలుగువాళ్లంతా ఆశ్చర్యపోయారు. సినిమాలో షారుఖ్ – సిరి కాంబినేషన్ లో సీన్స్ కూడా ఉన్నాయి. దీంతో ఆ అమ్మాయి జవాన్ సినిమా దాకా వెళ్లిందా, షారుఖ్ తో యాక్ట్ చేసిందా అని షాక్ అయ్యారు.

జవాన్ సినిమా తర్వాత సిరి మరింత పాపులర్ అయింది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరి జవాన్ సినిమా గురించి మాట్లాడుతూ.. జవాన్ లో నటించేందుకు మొదట ఫోన్ రాగా ప్రాంక్ కాల్ అని లైట్ తీసుకున్నాను. ఆ తర్వాత నా మేనేజర్ కూడా ఫోన్ చేసి చెప్పడంతో షాక్ అయ్యాను. షూటింగ్ కోసం ముంబై వెళ్ళాను. సెట్స్ లో షారుఖ్ గారిని చూసేదాకా నమ్మకం కలగలేదు. సెట్స్ కి వెళ్ళాక కూడా ఇది నిజంగానే షారుఖ్ సర్ సినిమానా అని చాలా మందిని అడిగాను. మొదటి సారి షూటింగ్ కి ముంబై వెళ్లడంతో భయం అనిపించి శ్రీహన్ ని తోడు తీసుకెళ్ళాను అని తెలిపింది.

Jawan Movie : జవాన్ సినిమాని ఆస్కార్‌కి తీసుకెళతాం.. షారుఖ్ సర్‌తో నేను మాట్లాడతాను.. అట్లీపై ట్రోల్స్..

అలాగే.. నేను తెలుగమ్మాయి అని అట్లీ గారికి తెలీదు. నన్ను కూడా హిందీ అమ్మాయి అనుకున్నారు. ఒక సీన్ లో డైలాగ్ సరిగ్గా చెప్పలేక దాదాపు ఏడు టేక్స్ తీసుకున్నాను. దాంతో అట్లీ సర్ బాగా తిట్టడంతో ఏడ్చేశాను. షారుఖ్ గారు నా దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని మోటివేట్ ఇచ్చారు. అసలు ఆయనతో నటించడమే ఒక కలలా ఉందంటే, ఆయన నా దగ్గరికి వచ్చి మోటివేట్ చేయడం ఎప్పటికి మర్చిపోలేను అని తెలిపారు.