సీత టీజర్: కాజల్‌ది నెగెటివ్ క్యారెక్టరా?

‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తర్వాత తేజ డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిస్తున్న సినిమా ‘సీత’. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. బంజారాహిల్స్‌లో ఉన్న ఖాళీ స్థలాన్ని ఖాళీ చేయించడాకి అంటూ తనికెళ్ల భరణి చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలవగా.. ‘నాకు సాయం చెయ్యి.. నన్ను పెళ్లి చేసుకుని..’ అని విలన్ సోనూ సూద్.. కాజల్‌తో అంటాడు. ఇందుకు కాజల్ సమాధానం ఇస్తూ.. ‘ఈ పెళ్లి పర్మనెంట్ అటాచ్‌మెంట్స్ నాకు వర్కవుట్ కావు’ అంటుంది. అయితే టెంపరరీ కమిట్‌మెంట్ అని అడగ్గానే ఎన్నిరోజులు అని సీత పాత్రదారి కాజల్ అంటుంది.
Read Also : కేజ్రీవాల్ కు బాబు రూ.50 కోట్లిచారట: ఇదో లెక్కా అంటున్న వైసీపీ
వెంటనే ‘మట్టికొట్టుకుపోతావే.. నువ్వు సీతవు కాదే.. శూర్పణఖవి..’ అంటూ కాజల్‌ను ఓ మహిళ తిడుతుంటే.. ఇందుకు కాజల్ ‘థాంక్యూ’ అనడం… ఇవన్నీ చూస్తుంటే కాజల్ నెగెటివ్ రోల్‌లో కనిపించే పాత్ర చేస్తుందా? అనిపిస్తుంది. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ చిన్నపిల్లాడిలా ప్రవర్తించడం నవ్వులు పూయిస్తోంది. కాజల్-బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సెకెండ్ సినిమా ఇది. గతంలో వీరిద్దరూ ‘కవచం’ అనే సినిమా చేయగా.. అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఏప్రిల్ 25న ఈ సినిమా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.
Read Also : సందట్లో సడేమియా : ప్రచారంలో షర్మిళ ఉంగరం చోరీ యత్నం