Sitara Ghattamaneni : మిస్ యూ అన్నయ్య.. వైరల్ అవుతున్న సితార పోస్ట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. ముఖ్యంగా మహేష్ గారాల పట్టి సితార సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. తాజాగా సితార చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది.

Sitara Ghattamaneni : మిస్ యూ అన్నయ్య.. వైరల్ అవుతున్న సితార పోస్ట్!

Sitara Ghattamaneni

Updated On : January 29, 2023 / 4:12 PM IST

Sitara Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. ముఖ్యంగా మహేష్ గారాల పట్టి సితార సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. ఫెస్టివల్ టైంలో ఫ్యామిలీ సెలెబ్రేషన్స్ ఫోటోలను, హాలిడే ట్రిప్ లో వెకేషన్ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ మహేష్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంటుంది. అలాగే దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురితో కలిసి మహేష్ పాటలకు డాన్స్ లు వేసిన వీడియోలను యూట్యూబ్ లో షేర్ చేసి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంటుంది. తాజాగా సితార చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది.

Chiru – Mahesh : రిలీజ్ డేట్‌లు వాయిదా వేస్తున్న చిరు, మహేష్..

అన్నయ్య గౌతమ్ తో కలిసి రోజు గొడవ పడుతూ సరదాగా ఉండే సితార.. ఇప్పుడు గౌతమ్ లేకపోవడంతో బాగా బోర్ ఫీల్ అవుతుంది. గౌతమ్ ఎక్కడికి వెళ్ళాడు అంటుకుంటున్నారా? స్కూల్ కల్చరల్ ట్రిప్ కోసమని ఇటీవల గౌతమ్ విదేశాలకు వెళ్ళాడు. ఇక అన్నయ్య లేకపోవడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో.. ‘మిస్ యూ అన్నయ్య. త్వరగా తిరిగి వచ్చేయ్’ అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ తో పాటు గౌతమ్ తో సరదాగా ఆడుతున్న ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా మహేష్ బాబు SSMB28 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సినిమా లేటు అవ్వడంతో త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు మేకర్స్. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ చాలా గ్యాప్ తరువాత ఇటీవలే మొదలయింది. హైదరాబాద్ సారధి స్టూడియోలో వేసిన ఒక ప్రత్యేక సెట్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. శ్రీలీల, పూజ హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి ఆగష్టు 11న రిలీజ్ చేస్తాము అంటూ నిర్మాత నాగవంశీ ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ చేంజ్ అయ్యినట్లు తెలుస్తుంది. అక్టోబర్‌ 18కు రిలీజ్ డేట్ షిఫ్ట్ అయ్యినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీని పై చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni)