Sitara Ghattamaneni: సితార సోషల్ మీడియా ప్రమోషన్.. గ్రౌండ్ వర్క్ దేనికి..?

టాలీవుడ్ లో స్టార్ హీరో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ఉంది ఈ స్టార్ కిడ్ సోషల్ మీడియా ఫాలోయింగ్. స్టార్ హీరో కుతురైనా.. తండ్రి స్టార్ డమ్ కి ఏమాత్రం తగ్గకుండా ఉంది ఫాన్స్ లో..

Sitara Ghattamaneni: టాలీవుడ్ లో స్టార్ హీరో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ఉంది ఈ స్టార్ కిడ్ సోషల్ మీడియా ఫాలోయింగ్. స్టార్ హీరో కుతురైనా.. తండ్రి స్టార్ డమ్ కి ఏమాత్రం తగ్గకుండా ఉంది ఫాన్స్ లో క్రేజ్. ఒక్క ఫోటో పోస్ట్ చేస్తే చాలు.. ఒక్క వీడియో పెడితే చాలు.. లక్షల లైకులు.. అంతకుమించి షేర్లు.. ఇక పాపులారిటీ గురించైతే చెప్పనక్కర్లేనంత రేంజ్ లో సంపాదించుకుంటోంది సీతాపాప. సితార సోషల్ మీడియా ప్రమోషన్ వెనక రీజనేంటి..?

 

Sitara Ghattamaneni

Sitara Ghattamaneni: సితార స్పెషల్ డాన్స్.. వీడియో షేర్ చేసిన మహేష్!

చిన్నప్పటి నుంచి ఇదే క్యూట్ నెస్ తో సూపర్ స్టార్ ఫాన్స్ నే కాకుండా అందరినీ బుట్టలో వేసేసుకుంది సితార. స్టార్ కిడ్ గా ఎంతో కొంత అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నా.. వాటిని క్రేజ్ గా మలచుకోవడంతో సితార స్టైల్ వేరు. మహేష్ ముద్దుల కూతురిగా, సీతాపాపగా సితారకు ఫుల్ క్రేజ్ ఉంది. మరి ఇంత క్యూట్ గా ఉండే సితార ను చూసి అభిమానులు మురిసిపోకుండా ఉంటారా. అందుకే సీతాపాపకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

Sitara Ghattamaneni

Sitara: సూపర్ డాటర్ వచ్చేసింది.. హైలైట్‌గా మారిన సితార ఎంట్రీ!

వరస పెట్టి పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తనకంటూ స్పెషల్ క్రేజ్ ని సంపాదించుకుంటోంది సితార. ప్రతి ఫోటోని, వీడియోని సితార పాపులారిటీని పెంచడం కోసమే వాడుతున్నారు నమ్రత, మహేష్. టీనేజ్ లోకి రాకముందే తనకంటూ సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేసుకున్న సితార.. అప్పటి నుంచి నాన్ స్టాప్ గా అప్ డేట్స్ ఇస్తూ ఫాలోవర్స్ ని ఎంగేజ్ చేస్తోంది. లేటెస్ట్ గా స్విమ్మింగ్ వీడియో పోస్ట్ చేసిన సితార, స్విమ్మింగ్ టిప్స్ కూడా చూపిస్తోంది.

Sitara Ghattamaneni

Sitara – Mahesh Babu : క్యూట్ పిక్.. సితార పాపతో సూపర్‌స్టార్..

ఇప్పటి వరకూ స్టైలిష్ గా ఉండే ఫోటోలు, వీడియోలతో ఫాన్స్ ని ఎంగేజ్ చేసిన సితార ఫస్ట్ టైమ్ కంప్లీట్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ తో, ట్రెడిషనల్ సాంగ్ కి చేసిన డాన్స్ అయితే సూపర్ స్టార్ ఫాన్స్ నే కాదు.. అందరు అభిమానుల్ని అలరించింది. శ్రీరాముడి పాటకు.. సీతాపాప చేసిన క్లాసికల్ డాన్స్ వీడియోని సోషల్ మీడియాలో మహేష్, నమ్రత.. ఎమోషనల్ గా పోస్ట్ చేశారు.

Sitara Ghattamaneni

Sitara Ghattamaneni : యాని మాస్టర్‌తో స్టెప్పులు ఇరగదీస్తున్న మహేష్ కూతురు.. ప్రాక్టీస్ దేనికోసమో?

ఇలా ముద్దుముద్దుగా ఇంట్లో డాన్సులు, వీడియోలు, ఫోటోలు పోస్ట్ చెయ్యడం సరే.. కానీ అప్పుడే సితార తెరంగేట్రం కూడా గట్టిగానే ప్లాన్ చేశారు మహేష్, నమ్రత. సితారను స్టార్ కిడ్ గా.. సర్కారు వారి పాటలో అఫీషియల్ ఎంట్రీ ఇప్పించేసి.. హీరోయిన్ గా సితారను లాంచ్ చెయ్యడానికి గట్టిగానే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.

Sitara Ghattamaneni

Sitara : మీరు ప్ర‌పంచానికి సూప‌ర్ స్టార్, మాకు మాత్రం మీరే ప్ర‌పంచం

పాప కూచిపూడి డాన్స్ చేసినా, స్విమ్మింగ్ ఎలా చెయ్యలో చూపించినా, సర్కారు వారి పాట సినిమాలో పెన్నీ పెన్నీ సాంగ్ కు స్టెప్పులు వేసినా ప్రతిదీ సోషల్ మీడియాలో క్రేజ్ పెంచడానికే అని క్లియర్ గా తెలుస్తోంది. అంతేకాదు.. ఎప్పుడూ మహేష్ బాబుని ముద్దుముద్దుగా ఇంటర్వ్యూ చేసే సితార.. ఈ సారి తనే స్పెషల్ గా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. చాలా మెచ్యూర్డ్ గామాట్లాడుతూ ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ కూడా చేస్తూ.. సోషల్ మీడియాలో ఎంగేజ్ చేస్తోంది సితార.

Sitara Ghattamaneni

Sitara – Mahesh Babu : మహేష్‌ బాబుతో సితార పాప.. వైరల్ అవుతున్నలవ్లీ పిక్..

ఓన్ గా సోషల్ మీడియా క్రియేట్ చేస్కోడంతో అప్డేట్ పోస్ట్ చేసే విషయంలో సూపర్ ఫాస్ట్ గా ఉంటోంది సితార. ఎప్పుడూ లేనంత స్పీడ్ గా ఇంత అర్జెంట్ గా సితారని సోషల్ మీడియాలో హైలెట్ చెయ్యడానికి రీజనేంటా అని ఆలోచిస్తున్నారుఫాన్స్. ఇంకేముంది టీనేజ్ లోకి వచ్చేసింది.. హీరోయిన్ గా లాంచ్ చెయ్యడానికి ఫౌండేషన్ ఇప్పటినుంచే వేస్తున్నారంటూ కొంతమంది ఇండస్ట్రీలో టాక్. ఎవరేమనుకున్నా.. క్యూట్ క్యూట్ గా ఉండే సితార మాత్రం ఆడియన్స్ ని తన స్టఫ్ తో సోషల్ మీడియాని మాత్రం ఎంగేజ్ చేసేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు