‘‘సిత్తరాల సిరపడు’’ ఫుల్ సాంగ్

‘అల... వైకుంఠపురములో’.. నుండి ‘సిత్తరాల సిరపడు’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు..

  • Published By: sekhar ,Published On : January 17, 2020 / 06:59 AM IST
‘‘సిత్తరాల సిరపడు’’ ఫుల్ సాంగ్

Updated On : January 17, 2020 / 6:59 AM IST

‘అల… వైకుంఠపురములో’.. నుండి ‘సిత్తరాల సిరపడు’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో.. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘అల… వైకుంఠపురములో’.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్, హౌస్ ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద విజయ విహారం చేస్తోంది.

Image

ఈ సినిమాలో ‘సిత్తరాల సిరపడు’ పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఆడియోలో దాచి ఉంచిన ఈ పాటను థియేటర్లో చూపించి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్. శుక్రవారం ‘సిత్తరాల సిరపడు’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. శ్రీకాకుళం యాసలో సాగిన ఈ పాటను ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితమిస్తున్నట్లు డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ తెలిపిన విషయం తెలిసిందే.

Image

ఈ పాటను ఫైట్‌గా తీసి ప్రేక్షకుల చేత ప్రశంసలందుకున్నాడు దర్శకుడు. ఈ పాటను విజయ్ కుమార్ రాయగా, సూరన్న, సాకేత్ కోమండూరి పాడారు. థియేటర్లలో విజిల్స్ వేయించిన ఈ పాట ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.