Ayalaan : థియేటర్స్ లో నో రిలీజ్.. రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న స్టార్ హీరో సినిమా..
థియేటర్స్ లో రిలీజ్ అవ్వకుండా రెండేళ్ల క్రితం ఆగిపోయిన సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది.(Ayalaan)
Ayalaan
- శివకార్తికేయన్ సినిమా
- రెండేళ్ల క్రితం రిలీజ్ ఆగిపోయిన సినిమా
- ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీలోకి
Ayalaan : అప్పుడప్పుడు కొన్ని సినిమా రిలీజ్ లకు అడ్డంకులు ఏర్పడి రిలీజ్ లు ఆగిపోతూ ఉంటాయి. అవి ఎప్పటికో బయటకు వస్తాయి. తాజాగా అలా పలు కారణాలతో థియేటర్స్ లో రిలీజ్ అవ్వకుండా రెండేళ్ల క్రితం ఆగిపోయిన సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది.(Ayalaan)
తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ కు తెలుగులో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. శివకార్తికేయన్ సినిమాలన్నీ తెలుగులో రిలీజయి ఇక్కడ కూడా మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. అయితే శివ కార్తికేయన్ చేసిన అయలాన్ అనే ఓ సినిమా 2023 లో రిలీజ్ అవ్వాలి. అనేక కారణాలతో వాయిదా పడి 2024 జనవరిలో రిలీజ్ అయింది.
Also Read : Sushmita Konidela : చిరంజీవి కూతురు ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా? మెగాస్టార్, పవర్ స్టార్ కాదు.. మరి ఎవరంటే..
అయితే కేవలం తమిళ్ లోనే రిలీజ్ అయింది. తెలుగులో కూడా రిలీజ్ చేస్తామంటూ తెలుగులో కూడా ప్రమోషన్స్ భారీగా చేసారు. కానీ ఆ సమయంలో తెలుగు రిలీజ్ అవ్వలేదు. తర్వాత ఓ రెండు మూడు సార్లు తెలుగులో థియేటర్స్ లో రిలీజ్ చేద్దామని ప్రయత్నించినా పలు కారణాలతో అది అవ్వలేదు. ఇప్పుడు రెండేళ్ల తర్వాత అయలాన్ సినిమా తెలుగులో థియేటర్స్ లో రిలీజ్ అవ్వకుండానే ఓటీటీలోకి వస్తుంది.
శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన అయలాన్ సినిమా ఆహా ఓటీటీలో రేపు జనవరి 7 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. తమిళ్ లో అయలాన్ అంటే ఏలియన్ అని అర్థం. ఒక ఏలియన్ భూమి మీదకు వచ్చి శివ కార్తికేయన్ తో ఉంటే ఏం జరిగింది అని సైన్స్ ఫిక్షన్, కామెడీ కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు.
Also Read : Jai Balayya : జై బాలయ్య అంటూ థియేటర్ దగ్గర రచ్చ చేస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..
అప్పట్లో ఈ సినిమా ట్రైలర్ తో మంచి అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్ల తర్వాత ఇప్పుడు అయలాన్ తెలుగులో వస్తుండటంతో సినిమా లవర్స్, శివకార్తికేయన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
View this post on Instagram
