Amrutha Chowdary : స్కంద సినిమాలో రామ్‌కి చెల్లెలిగా నటించింది ఎవరో తెలుసా? భీమవరం అమ్మాయి.. సోషల్ మీడియాలో సూపర్ ఫాలోయింగ్..
స్కంద సినిమాలో రామ్ చెల్లెలిగా ఓ కొత్త అమ్మాయి నటించింది. దీంతో ఈమె ఎవరా అని సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.

Skanda Movie Ram Sister Character Amrutha Chowdary Full Details Here
Amrutha Chowdary : మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu), ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) కాంబోలో తెరకెక్కిన ఊర మాస్ సినిమా ‘స్కంద’. సెప్టెంబర్ 28న థియేటర్స్ లో రిలీజయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రామ్ ని ఇప్పటివరకు చూడనంత మాస్ గా చూపించారు. శ్రీలీల(Sreeleela), సయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటించగా శ్రీకాంత్, పృథ్వీ, ఇంద్రజ, గౌతమి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.
స్కంద ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి, B C సెంటర్స్ వాళ్ళకి బాగా నచ్చుతుంది. బోయపాటి తన మాసిజాన్ని ఈ సారి మరింత డబల్ చేయగా రామ్ యాక్టింగ్ తో అదరగొట్టాడు. దీంతో ఈ సినిమా మంచి విజయం సాధించి ఇప్పటికే రెండు రోజుల్లోనే 27 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమాలో రామ్ చెల్లెలిగా ఓ కొత్త అమ్మాయి నటించింది. దీంతో ఈమె ఎవరా అని సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. రామ్ చెల్లెలిగా సెకండ్ హాఫ్ లో కొంచెం ఎక్కువసేపే కనిపించింది ఆ అమ్మాయి. తెల్లగా, హీరోయిన్ మెటీరియల్ గా ఉన్న ఆ అమ్మాయి ఎవరా అని ఆలోచిస్తున్నారు.
అయితే స్కంద సినిమాలో రామ్ కి చెల్లెలిగా నటించిన అమ్మాయి పేరు అమృత చౌదరి. ఈ అమ్మాయి భీమవరంకి చెందిన అమ్మాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అమృత చౌదరి కాలేజీలో చదువుతున్నప్పటి నుంచే పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. పలు కవర్ సాంగ్స్ లో కూడా నటించింది. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఆర్టిస్ట్ గా ట్రై చేస్తుంది. తాజాగా స్కంద అవకాశం రావడంతో స్కంద సినిమాలో రామ్ కి చెల్లెలిగా నటించి మెప్పించింది. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లోనే అమృత బోల్డ్ సీన్స్ లో నటించింది. ఇక సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంది. స్కంద సినిమాతో మరింత పాపులార్ అవ్వడంతో భవిష్యత్తులో మరిన్ని సినిమా అవకాశాలు రావొచ్చు. ఇటీవల తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ఒక్కొక్కరు వస్తున్నారు. అదే బాటలో అమృత చౌదరి కూడా హీరోయిన్ గా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.