Sneha Prasanna : ‘ప్రసన్న’తో విడాకుల వార్తలకు.. ఒక్క ఫోటోతో చెక్ పెట్టేసిన స్నేహ..

టాలీవుడ్ సీనియర్ నటి స్నేహ తన భర్తకు విడాకులు ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ స్నేహ, తమిళ యాక్టర్ ప్రనన్నని 2011లో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన స్నేహ.. మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తుంది. అయితే గత కొంతకాలంగా ఈ జంట విడాకులు తీసుకుతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

Sneha Prasanna : ‘ప్రసన్న’తో విడాకుల వార్తలకు.. ఒక్క ఫోటోతో చెక్ పెట్టేసిన స్నేహ..

Sneha ended the news of divorce with Prasanna with one photo

Updated On : November 13, 2022 / 4:08 PM IST

Sneha Prasanna : టాలీవుడ్ సీనియర్ నటి స్నేహ తన భర్తకు విడాకులు ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ స్నేహ, తమిళ యాక్టర్ ప్రనన్నని 2011లో వివాహం చేసుకుంది. 2009లో వచ్చిన థ్రిల్లర్ చిత్రం ‘అఛ్చాముండు అఛ్చాముండు’లో ప్రసన్న, స్నేహ తొలిసారి జంటగా నటించారు. ఆ సినిమాతో ఏర్పడిన వీరిద్దరి బంధం ప్రేమగా మారి రెండేళ్ల తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

Actress Sneha: వయసు పెరిగినా.. వన్నెతగ్గని స్నేహ అందాలు!

పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన స్నేహ.. మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తుంది. అలాగే తన భర్తతో కలిసి కొన్ని యాడ్స్ లోను నటించింది. అయితే గత కొంతకాలంగా ఈ జంట విడాకులు తీసుకుతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక లాస్ట్ టూ డేస్ లో అయితే స్నేహ ప్రసన్నకు దూరంగా ఉంటూ ఒంటరిగా జీవిస్తోందన్న ప్రచారం కూడా జరుగుతోంది.

ఇక విసుగెత్తిపోయిన స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో అందరికి బదులిచ్చింది. తన భర్త ప్రసన్నని ముద్దాడుతున్న ఫోటోను స్నేహ షేర్ చేస్తూ.. “ట్వినింగ్… హ్యాపీ వీకెండ్” అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో రుమౌర్స్ కి తెరపడింది. కాగా వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Sneha ended the news of divorce with Prasanna with one photo

Sneha ended the news of divorce with Prasanna with one photo