Sobhita Dhulipala : నాగ‌చైత‌న్య‌తో నిశ్చితార్థం.. షారుక్‌ఖాన్‌ను బీట్ చేసిన శోభిత దూళిపాళ‌

టాలీవుడ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య‌, న‌టి శోభితా ధూళిపాళ నిశ్చితార్థం ఆగ‌స్టు 8న హైద‌రాబాద్‌లో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

Sobhita Dhulipala : నాగ‌చైత‌న్య‌తో నిశ్చితార్థం.. షారుక్‌ఖాన్‌ను బీట్ చేసిన శోభిత దూళిపాళ‌

Sobhita Dhulipala beats Shah Rukh Khan on IMDb Popular Indian Celebrities list

Updated On : August 13, 2024 / 8:46 AM IST

Sobhita Dhulipala-Shah Rukh Khan : టాలీవుడ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య‌, న‌టి శోభితా ధూళిపాళ ల‌ నిశ్చితార్థం ఆగ‌స్టు 8న హైద‌రాబాద్‌లో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో చాలా మంది శోభిత గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఆమె గురించి గూగుల్‌లో తెగ వెతికారు. ఫ‌లితంగా ఆమె ఎక్కువ ప్ర‌జాద‌ర‌ణ పొందిన భార‌తీయ న‌టీన‌టుల జాబితాలో రెండ స్థానంలో నిలిచింది. ఇండియ‌న్ మూవీస్ డేటాబేస్ (ఐఎండీబీ) ఈ వారం అత్యంత ప్ర‌జాదార‌ణ పొందిన భార‌తీయ సెల‌బ్రిటీల జాబితాను విడుద‌ల చేసింది. ఈ జాబితాలో న‌టి శార్వ‌రీ మొద‌టి స్థానంలో నిలిచింది.

ముంజ్యా విడుదలైన తర్వాత IMDb బ్రేక్‌అవుట్ స్టార్‌మీటర్ అవార్డును గెలుచుకోవ‌డంతో శార్వ‌రీ అగ్ర‌స్థానంలో నిలిచింది. ఆ త‌రువాత శోభిత దూళిపాళ రెండో స్థానంలో ఉంది. ఇక బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మూడో స్థానంలో, నాలుగులో కాజ‌ల్‌, ఐదులో జాన్వీక‌పూర్‌లు ఉన్నారు. లక్ష్య, దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి, మృణాల్ ఠాకూర్, ఐశ్వర్య రాయ్ ఈ వారం టాప్ 10లో మిగిలిన స్థానాల్లో ఉన్నారు.

Harish Shankar : ఒరేయ్‌.. ఎక్కువ అరుస్తున్నావ్ నిన్ను ట్విట్టర్ లో బ్లాక్ చేస్తా.. హ‌రీష్‌ శంక‌ర్‌\

చైత‌న్య‌, శోభిత దూళిపాళ లు 2022 నుంచి డేటింగ్ చేస్తున్నారు. గ‌త గురువారం నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం అనంత‌రం శోభిత ఎంతో ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. మ‌న ప‌రిచ‌యం ఎలా మొద‌లైనా.. ప్రేమ‌లో మ‌న హృద‌యాలు క‌లిసిపోయాయి. అని రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. శోభిత టాలీవుడ్‌,బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ న‌టిస్తున్నారు. ఇటీవ‌ల అక్క‌డ మంకీ మ్యాన్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు.

Raviteja : సాయంత్రం 6 వ‌ర‌కు ఒక‌లా.. ఆ త‌రువాత మ‌రోలా.. హ‌రీష్ శంక‌ర్ పై ర‌వితేజ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

 

View this post on Instagram

 

A post shared by Sobhita (@sobhitad)