Sobhita Dhulipala : పెళ్లి, మాతృత్వంపై శోభిత ధూళిపాళ వ్యాఖ్యలు.. చైతుతో నిచ్చితార్ధం అయ్యాక మొదటి ఇంటర్వ్యూ..

శోభిత మాట్లాడుతూ తన నిశ్చితార్థం, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చైతుతో నిశ్చితార్థం తర్వాత ఇదే తన మొదటి ఇంటర్వ్యూ కావడం గమనార్హం.

Sobhita Dhulipala : పెళ్లి, మాతృత్వంపై శోభిత ధూళిపాళ వ్యాఖ్యలు.. చైతుతో నిచ్చితార్ధం అయ్యాక మొదటి ఇంటర్వ్యూ..

Sobhita Dhulipala Interesting Comments on Marriage and Motherhood in Interview

Updated On : September 26, 2024 / 9:24 AM IST

Sobhita Dhulipala : హీరోయిన్ శోభిత ధూళిపాళ – నాగ చైతన్య ఇటీవల ఆగస్టు 9న నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక చైతుతో నిశ్చితార్థం అయ్యాక శోభిత మరింత పాపులర్ అయింది. శోభిత ఏం మాట్లాడినా, ఏ ఫోటో పెట్టినా వైరల్ అవుతుంది. శోభిత లవ్ సితార అనే ఓటీటీ సినిమాతో రేపు సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ క్రమంలో ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ తన నిశ్చితార్థం, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చైతుతో నిశ్చితార్థం తర్వాత ఇదే తన మొదటి ఇంటర్వ్యూ కావడం గమనార్హం.

Also Read : Jackky Bhagnani : స్టార్ డైరెక్టర్ పై కేసు పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. ఆ విషయంలో..

ఈ ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాళ మాట్లాడుతూ.. నా నిశ్చితార్థం, పెళ్లి గ్రాండ్ గా చేసుకోవాలని నేను కలలు కనలేదు. వాటి కోసం ప్లాన్స్ వేసుకోలేదు. సాంప్రదాయంగా సింపుల్ గా జరిగితే చాలు అనుకున్నాను. అనుకున్నట్టే సింపుల్ గా ఫ్యామిలీ మధ్యలో జరిగింది. నా వరకు అది పర్ఫెక్ట్. నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లలని కనాలి అనుకునేదాన్ని. మాతృత్వంలోని అనుభూతిని నేను పొందాలి అనుకుంటాను. అలాగే నా పేరెంట్స్, సంసృతి, సంప్రదాయాలను గౌరవిస్తాను. అందుకే నేను ఎంత ఎదిగిన నాకు సంబంధించినవి సాంప్రదాయంగా మా పేరెంట్స్ సమక్షంలో జరగాలి అనుకుంటాను అని తెలిపింది. దీంతో పెళ్లి కూడా సింపుల్ గా ఫ్యామిలీ, సన్నిహితుల మధ్య సాంప్రదాయంబద్దంగా జరుగుతుందని తెలుస్తుంది.

View this post on Instagram

A post shared by Sobhita (@sobhitad)