క్రిస్మస్‌కు తేజ్ సినిమా

  • Published By: sekhar ,Published On : November 28, 2020 / 04:34 PM IST
క్రిస్మస్‌కు తేజ్ సినిమా

Updated On : November 28, 2020 / 4:41 PM IST

Solo Brathuke So Better: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటిస్తున్న సినిమా.. ‘సోలో బ్రతుకే సో బెటర్’..

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.


లాక్‌డౌన్ కారణంగా ఇన్నాళ్లూ వెలవెలబోయిన థియేటర్లు డిసెంబర్ నుంచి కళకళలాడబోతున్నాయి.Imageకొద్దిరోజుల క్రితమే తమ సినిమాను డిసెంబర్లో విడుదల చేస్తామని చెప్పిన టీమ్, ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేసింది.
https://10tv.in/heroines-busy-with-seniors-and-young-stars/
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ‘సోలో బ్రతుకే సో బెటర్’ రిలీజ్ కానుంది. తేజ్ నటించిన ‘ప్రతి రోజు పండగే’ మూవీ గతేడాది డిసెబంర్ 20న విడుదలైంది. మళ్లీ సంవత్సరం తర్వాత ‘సోలో బ్రతుకే సో బెటర్’ తో థియేటర్లలో సందడి చేయబోతున్నాడు.



ఇప్పటివరకు విడుదల చేసిన ‘నో పెళ్లి’, ‘అమృత’, ‘హేయ్ ఇది నేనేనా’ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాకు సంగీతం : థమన్, కెమెరా : వెంకట్ సి దిలీప్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : అవినాష్ కొల్లా.