Man vs Wild : ఆయామ్ ఆల్ రైట్..డోంట్ వర్రీ – రజనీకాంత్

  • Published By: madhu ,Published On : January 29, 2020 / 01:17 AM IST
Man vs Wild : ఆయామ్ ఆల్ రైట్..డోంట్ వర్రీ – రజనీకాంత్

Updated On : January 29, 2020 / 1:17 AM IST

మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని సూపర్ స్టార్ రజనీకాంత్ వెల్లడించారు. చెప్పారు. చెట్టుకొమ్మలు మాత్రం చేతులపై అక్కడక్కడ గీసుకున్నాయని… తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. బేర్ గ్రిల్స్‌తో కలిసి ఈ కార్యక్రమంలో నటించడం మంచి అనుభవాన్నిచ్చిందన్నారు. గాయాలు అయిన వార్త విస్తృతంగా వ్యాపించడంతో రజనీకాంత్‌ స్వయంగా వివరణ ఇచ్చారు. చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. 

మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో భాగంగా రజనీకాంత్‌ కర్నాటక వెళ్లారు. హోస్ట్ బేర్ గ్రిల్స్‌తో కలిసి షూటింగ్ చేస్తున్నారు. బందిపూర్‌ టైగర్‌ రిజర్వ్‌లో 2020, జనవరి 28వ తేదీ మంగళవారం నుంచి మూడ్రోజుల పాటు షెడ్యూల్ ప్లాన్ చేశారు. అయితే తొలిరోజే షూట్ చేస్తున్నపుడు అనుకోకుండా రజినీ కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన భుజానికి గాయాలయ్యాయి. అయితే గాయం తీవ్రత మరీ ఎక్కువేం కాదని.. స్వల్ప గాయాలే అని వైద్యులు తెలిపారు. దాంతో ఉన్నపళంగా ఆయన షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి చెన్నై వెళ్లిపోయాడు. 

* డిస్కవరీ ఛానెల్ చూసే వారికి మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 
* ఈ షోని  మొత్తం నడిపించే బేర్ గ్రిల్స్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. పర్యావరణ సంరక్షణ అనే కాన్సెప్గ్‌తో ఈ షోని నడిపిస్తుంటాడు. 
* ఇలాంటి షోలో రజనీ పార్టిసిపేట్‌ చేస్తున్నారని తెలిసి అభిమానులు హ్యాపీగా పీలయ్యారు. 

* గతేడాది మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ షోలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు.
* ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ అటవీ ప్రాంతంలో బేర్‌ గ్రిల్స్‌తో కలిసి మోదీ కలియతిరిగారు.
* మోదీతో చేసిన షో అత్యంత ప్రేక్షకాదరణ పొందింది.

* ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో డిస్కవరీ నెట్‌వర్క్‌పై ఈ మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ కార్యక్రమం ప్రసారమైంది. 

Read More : Coronavirus : చైనాలో భారతీయుల కోసం విమానం రెడీ