Sonu Sood : అనాథ పిల్లల కోసం.. సోనూసూద్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్..

పలువురు సోనూసూద్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇటీవల బీహార్ కు చెందిన 27 ఏళ్ళ ఇంజనీర్ బీరేంద్రకుమార్‌ మహతో అనాథ పిల్లల కోసం సోనూసూద్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించాడు. ఇప్పటికే ఈ స్కూల్ లో 100 మందిదాకా పిల్లలు ఉన్నారు.

Sonu Sood : అనాథ పిల్లల కోసం.. సోనూసూద్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్..

Sonu Sood support to Sonu Sood International Public School in Bihar

Updated On : May 31, 2023 / 6:25 AM IST

Sonu Sood International Public School :  సినీ నటుడు సోనూసూద్ కరోనా సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేసి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఎంతో మంది పేదలకు తిండి, ఇల్లు, బట్టలు.. ఇలాంటి కనీస అవసరాలకు సహాయం చేశారు. కొంతమంది విద్యార్థులకు చదువులో, కొంతమంది కష్టపడి సంపాదించుకోవడానికి బిజినెస్ లో, కొంతమందికి ఉద్యోగం అందించడంలో.. ఇలా కరోనా ఆతర్వాత కూడా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు సోనూసూద్.

దీంతో దేశవ్యాప్తంగా ఆయన ద్వారా లబ్ది పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. వారంతా సోనూసూద్ పట్ల కృతజ్ఞతా భావంతో ఉన్నారు. ఇక పలువురు సోనూసూద్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇటీవల బీహార్ కు చెందిన 27 ఏళ్ళ ఇంజనీర్ బీరేంద్రకుమార్‌ మహతో అనాథ పిల్లల కోసం సోనూసూద్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించాడు. ఇప్పటికే ఈ స్కూల్ లో 100 మందిదాకా పిల్లలు ఉన్నారు. దాతలు ఇచ్చే వాటి మీదే ఈ స్కూల్ రన్ అవుతుంది. ఈ విషయం సోనూసూద్ కి తెలియడంతో తాజాగా సోనూసూద్ బీహార్ కు వెళ్లారు.

Mrmu Famous Unit : కొందరు కావాలనే మా సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.. మా సినిమాని తొక్కేయాలని చూస్తున్నారు..

సోనూసూద్ బీహార్ కి వెళ్లి బీరేంద్రకుమార్‌ మహతోని కలిశారు. ఆయనతో చర్చించిన అనంతరం అక్కడ పిల్లలకు మరింత మెరుగైన వసతి, విద్యు, ఆహరం అందించడానికి, మరింతమంది అనాథపిల్లలను చేర్చుకోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అందచేస్తానని, సోనూసూద్ ఇంటర్నేషనల్ స్కూల్ కి కొత్త బిల్డింగ్ కట్టిస్తానని సోనూసూద్ తెలిపారు. ఇకపై బీరేంద్రకుమార్‌ మహతో తో కలిసి పనిచేస్తానని సోనూసూద్ తెలిపారు. దీంతో బీరేంద్రకుమార్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోనూసూద్ అక్కడి పిల్లలతో మాట్లాడిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.