Begumpet fast food centerలో సోనూ సూద్, అభిమాని ఆనందం

Begumpet fast food centerలో సోనూ సూద్, అభిమాని ఆనందం

Updated On : December 26, 2020 / 2:27 PM IST

Sonu Sood surprises a food stall : ప్రముఖ సినీ నటుడు, రియల్ హీరో సోనూసూద్‌ తన అభిమానిని ఆశ్చర్యపరిచాడు. సోనూసూద్‌ సేవల స్పూర్తితో హైదరాబాద్ బేగంపేటకు చెందిన అనిల్‌ ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నడుపుతున్నాడు. ఆ సెంటర్‌కి లక్ష్మీ సోనూసూద్‌ అనే పేరు పెట్టాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా సోనూసూద్‌కు చేరగా, ఆ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వచ్చి అనిల్‌ కుమార్‌ను ఆశ్చర్చపరిచాడు.  ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో తయారు చేసిన ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ను రుచి చూసిన సోనూసూద్‌ అనిల్‌ కృషిని అభినందించారు. కొంచెం సేపు గరిటే పట్టి.. ఫుడ్స్ ను కూడా రెడీ చేశారు. దీంతో అనిల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడట. తన సెంటర్ కు వచ్చిన సోనూ సూద్ ను శాలువాతో సత్కరించిన అనిల్… ఈ సంఘటనను ఎప్పటికి మర్చిపోలేనని సంతోషం వ్యక్తం చేశాడు.

అనిల్ వ్యాపారంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని సోనూ సూద్ ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లాలో తనకు ఆలయాన్ని నిర్మిస్తున్న దుబ్బతండాను త్వరలోనే సందర్శించి గ్రామస్థులు కోరుతున్న ఆసుపత్రి విషయాన్ని చర్చించనున్నట్లు వివరించారు. బేగంపేటకు చెందిన అనిల్‌కు సోనూసూద్‌ అంటే ఎంతో అభిమానం. ఈ అభిమానంతోనే సోనూసూద్‌ పేరుతో పాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నడుపుతున్నాడు. సోనూ పేరు పెట్టడంతో తనకు బిజినెస్‌ రెట్టింపు అయ్యిందని అనిల్‌ తెలిపాడు. ఈ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపాడు.