Sonudi Film Factory : సోనుది ఫిల్మ్ ఫ్యాక్టరీ మొదటి సినిమా ప్రారంభం.. సినీ ప్రముఖుల చేతుల మీదుగా..

సోనుది ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో కొత్త సినిమా ప్రారంభమైంది.

Sonudi Film Factory : సోనుది ఫిల్మ్ ఫ్యాక్టరీ మొదటి సినిమా ప్రారంభం.. సినీ ప్రముఖుల చేతుల మీదుగా..

Sonudi Film Factory first Movie Opening with Ashish Gandhi

Updated On : March 3, 2025 / 8:25 AM IST

Sonudi Film Factory : ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా సోనుది ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో కొత్త సినిమా ప్రారంభమైంది. లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హీరో హీరోయిన్ పై మ్యూజిక్ డైరెక్టర్ RP పట్నాయక్ క్లాప్ కొట్టగా తొలి షాట్ ను దేవుడిపై చిత్రీకరించారు. డైరెక్టర్స్ వీరశంకర్, నవీన్ ఎర్నేని, తనికెళ్ల భరణి ఈ సినిమా దర్శక ద్వయం కిట్టి కిరణ్, లక్ష్మీ చైతన్య లకు స్క్రిప్ట్ ను అందించారు. ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ టి, వంశీ కెమెరా స్విచ్చాన్ చేశారు.

Also See : ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ‘శివంగి’ ట్రైలర్ రిలీజ్..

Sonudi Film Factory first Movie Opening with Ashish Gandhi

సినిమా ఓపెనింగ్ అనంతరం నిర్మాత RU రెడ్డి మాట్లాడుతూ.. మా బ్యానర్ నుండి వస్తున్న ఈ సినిమాని కొత్త డైరెక్టర్స్ తో కొత్త కథతో తెరకెక్కిస్తున్నాము. సినిమా షూటింగ్ మార్చి 6 నుండి మొదటి షెడ్యూల్ ఊటి లో చేయబోతున్నాం. అనంతరం రెండో షెడ్యూల్ హైదరాబాద్ జరగనుంది. మా సోనుది ఫిల్మ్ ఫ్యాక్టరీ నుండి ఏడాదికి కొన్ని సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సమాజం మాకు ఎంతో ఇచ్చింది. మా వంతుగా మేము కూడా సమాజానికి మేలు చేసే మంచి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాం అని అన్నారు.

Sonudi Film Factory first Movie Opening with Ashish Gandhi

Also See : W/O Anirvesh Trailer : జబర్దస్త్ రామ్ ప్రసాద్ హీరోగా ‘W/O అనిర్వేశ్’.. ట్రైలర్ రిలీజ్.. భార్య, ప్రియుడు కలిసి భర్తను..

డైరెక్టర్స్ కిట్టి కిరణ్, లక్ష్మీ చైతన్యలు మాట్లాడుతూ.. మా టాలెంట్ ను నిరూపించుకునే అవకాశం కల్పించిన నిర్మాత RU రెడ్డి గారికి కృతజ్ఞతలు. సినిమాను గొప్పగా తీసే ప్రయత్నం చేస్తున్నాం అని అన్నారు.