Sonu Sood : క్షమాపణతోనే నార్తర్న్ రైల్వేకి కౌంటర్ వేసిన సోనూసూద్..
రియల్ హీరో సోనూసూద్ చేసే పనులు చూసి అందరూ ప్రశంసిస్తుంటారు. కానీ నార్తర్న్ రైల్వే మాత్రం ఈ హీరో చేసిన పనికి నిందిస్తూ హెచ్చరించింది. ఇక దీనిపై సోనూసూద్ స్పందించాడు. నార్తర్న్ రైల్వేకి క్షమాపణ చెబుతూనే కౌంటర్ వేశాడు.

Sonusood countered the Northern Railway with an apology
Sonu Sood : రియల్ హీరో సోనూసూద్ చేసే పనులు చూసి అందరూ ప్రశంసిస్తుంటారు. కానీ నార్తర్న్ రైల్వే మాత్రం ఈ హీరో చేసిన పనికి నిందిస్తూ హెచ్చరించింది. ఇటీవల సోనూసూద్ రన్నింగ్ ట్రైన్‌లో ఫుట్‌బోర్డు దగ్గర కూర్చొని ఉన్న ఒక వీడియోని తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు. అదికాస్తా వైరల్ అయ్యి నార్తర్న్ రైల్వే వరకు చేరడంతో, సోనూసూద్ ని హెచ్చరిస్తూ ఒక ట్వీట్ చేసింది నార్తర్న్ రైల్వే.
Sonu Sood : సోనూసూద్‌పై నార్తర్న్ రైల్వే ఆగ్రహం..
‘డియర్ సోనూసూద్ మీరు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతోమందికి రోల్ మోడల్. అలాంటి మీరు ట్రైన్‌లో ప్రయాణించేటప్పుడు ఈ విధంగా చేస్తుంటే.. ఎంతోమంది దానిని అనుసరించే ప్రమాదం ఉంది. కాబట్టి మరోసారి ఇలా చేయకండి ప్లీజ్. సాఫీగా సేఫ్ జర్నీని ఆనందించండి’ అంటూ ట్వీట్ చేసింది. ఇక దీనిపై సోనూసూద్ స్పందించాడు. నార్తర్న్ రైల్వేకి క్షమాపణ చెబుతూనే కౌంటర్ వేశాడు.
‘నేను క్షమాపణ కోరుతున్నాను. రైళ్ల తలుపుల దగ్గరే కూర్చొని లక్షలాది మంది పేదలు రైలు ప్రయాణం చేస్తున్నారు. వారి బాధని అర్థం చేసుకోవడానికే నేను ఫుట్‌బోర్డు దగ్గర కూర్చున్నాను. మీరు ఇచ్చిన ఈ సందేశానికి ధన్యవాదాలు. అలాగే రైల్వేలో ఏర్పాట్లను మెరుగ్గా చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడు. సోనూసూద్ వ్యాఖ్యలు చూస్తుంటే ఇన్‌డైరెక్ట్‌గా రైల్వే సిస్టంపై సైటర్ వేసినట్లే ఉన్నాయి.
क्षमा प्रार्थी ?
बस यूँ ही बैठ गया था देखने,
कैसा महसूस करते होंगे वो लाखों ग़रीब जिनकी ज़िंदगी अभी भी ट्रेन के दरवाज़ों पे गुज़रती है।
धन्यवाद इस संदेश के लिए और देश की रेल व्यवस्था बेहतर करने के लिए। ❤️? https://t.co/F4a4vKKhFy— sonu sood (@SonuSood) January 5, 2023