సూర్య – ‘సూరరై పోట్రు’ షూటింగ్ పూర్తి
తమిళ స్టార్ హీరో సూర్య, అపర్ణా బాలమురళి జంటగా నటిస్తున్న 'సూరరై పొట్రు'.. షూటింగ్ పూర్తి..

తమిళ స్టార్ హీరో సూర్య, అపర్ణా బాలమురళి జంటగా నటిస్తున్న ‘సూరరై పొట్రు’.. షూటింగ్ పూర్తి..
తమిళ్ మూవీ ‘ఇరుదుసుట్రు’ (తెలుగులో గురు) ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో, 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై స్టార్ హీరో సూర్య నటిస్తూ, నిర్మస్తున్న సినిమా ‘సూరరై పొట్రు’.. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అపర్ణా బాలమురళి హీరోయిన్‌గా కాగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటించారు.
రీసెంట్‌గా ‘సూరరై పొట్రు’.. షూటింగ్ పూర్తి చేసుకుంది. సూర్య ఇమేజ్‌కు తగ్గట్టు డిఫరెంట్ కథా కథనాలతో సుధా కొంగర ఈ సినిమా రూపొందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. తమిళ్‌తో పాటు హిందీ, తెలుగు భాషల్లోనూ ‘సూరరై పొట్రు’.. చిత్రాన్ని రిలీజ్ చెయ్యనున్నారు.
Read Also : అక్టోబర్ 18న ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’..
జాకీష్రాఫ్, కరుణాస్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నాడు. సినిమాటోగ్రఫీ : నిఖేత్ బొమ్మి, ఎడిటింగ్ : సతీష్ సూర్య.