SOULS Movie Teaser: వెంకటేష్ మహా చేతుల మీదుగా సోల్స్ టీజర్!
కొత్తదనంతో నిండిన కథలు, కథనంతో దర్శకులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.

Souls
SOULS Movie Teaser: కొత్తదనంతో నిండిన కథలు, కథనంతో దర్శకులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలికాలంలో అటువంటి ప్రయోగాలను చేస్తూనే ఉన్నారు కొత్త దర్శకులు. వాటిలో కొన్ని సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే యువ దర్శకుడు శ్రావణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “సోల్స్”. పరమకృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయలక్ష్మి వేలూరి నిర్మించిన ఈ సినిమా టీజర్ లేటెస్ట్‌గా విడుదలైంది.
కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి సినిమాలతో ప్రత్యేకమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వెంకటేష్ మహా ఈ సినిమా టీజర్‌ని వాలంటైన్స్ డే సంధర్భంగా విడుదల చేశారు. మనకు ఎదురయ్యే ఏ పరిచయం కూడా యాదృచ్ఛికం కాదు. అనే కథా నేపథ్యంతో రెండు సోల్స్ మధ్య జరిగే ప్రయాణాన్ని సినిమాలో చూపించినట్లుగా చిత్రయూనిట్ చెబుతోంది.
సిక్కింలోని అరుదైన ప్రదేశాలలో చిత్రీకరణ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాలో త్రినాధ్ వర్మ, భావన సాగి హీరోహీరోయిన్లుగా నటించారు. టీజర్ విడుదల చేసిన అనంతరం.. దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ.. టీజర్ చూస్తుంటే సినిమా మ్యూజికల్ లవ్ స్టొరీలా అనిపిస్తోంది.
ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన త్రినాథ్ వర్మ, భావన సాగిలు చాలా బాగా నటించారు. సోల్స్ సినిమా సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి ప్రతిక్ అబ్యంకర్ అండ్ ఆనంద్ నంబియార్ సంగీతం అందించారు. శశాంక్ శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. రవితేజ మహదాస్యం, మౌమిక రెడ్డి తదితరులు ఈ చిత్రంలో నటించారు.