South Heroins: సౌత్‌కు గుడ్ బై.. బాలీవుడ్‌పైనే గంపెడు ఆశలు!
పూజా హెగ్డే, రష్మికా ఇప్పుడు బ్రేక్ తీసుకున్నా.. మళ్లీ వెంటనే తెలుగు సినిమాల్లో కనిపిస్తారు కానీ ఒక్క టాలీవుడ్ స్టార్ సినిమా చేతిలో లేని రకుల్ ప్రీత్ సింగ్ ఆశలన్నీ బాలీవుడ్ పైనే పెట్టుకుంది. అక్కడ జాకీ భగ్నానీతో లవ్ ట్రాక్ నడుపుతూనే వరుస సినిమా షూటింగ్స్ తో బిజీ అయింది.

South Heroins
South Heroins: పూజా హెగ్డే, రష్మికా ఇప్పుడు బ్రేక్ తీసుకున్నా.. మళ్లీ వెంటనే తెలుగు సినిమాల్లో కనిపిస్తారు కానీ ఒక్క టాలీవుడ్ స్టార్ సినిమా చేతిలో లేని రకుల్ ప్రీత్ సింగ్ ఆశలన్నీ బాలీవుడ్ పైనే పెట్టుకుంది. అక్కడ జాకీ భగ్నానీతో లవ్ ట్రాక్ నడుపుతూనే వరుస సినిమా షూటింగ్స్ తో బిజీ అయింది. అటాక్ తర్వాత ఆమె నటించిన రన్ వే 34 ఆమె కనిపించనుంది. ఆ తర్వాత మిషన్ సిండ్రిల్లా, డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్, అయలాన్, ఛత్రివాలి సినిమాలతో నార్త్ ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పెంచుతోంది.
South Heroins: టార్గెట్ బాలీవుడ్.. సౌత్ గర్ల్స్ అడ్డాగా మారిన బీటౌన్!
ఈ లెక్కన చూస్తే సౌత్ లో రకుల్ కి లాంగ్ గ్యాప్ రాబోతుంది. అలా అని ఇక్కడి వారు రకుల్ ని పెద్దగా సంప్రదిస్తున్నట్టు కూడా కనిపించడం లేదు. వలిమై తర్వాత అజిత్, హెచ్ వినోద్ కాంబో సినిమాలో రకుల్ పేరు వినిపించింది. తెలుగు, తమిళ్ భాషల్లో 31 లేడీస్ నైట్ అనే సినిమా చేస్తోంది. భారతీయుడు2లో కూడా రకుల్ నటించాల్సి ఉంది. కానీ వీటిలో సౌత్ ప్రేక్షకుల ముందుకు ఏ సినిమా రావాలన్నా చాలా టైమ్ పట్టేలా ఉంది.
South Heroins: ముదురు భామలు.. కానీ పెళ్లికేముంది తొందర!
రాశీఖన్నా కూడా బాలీవుడ్ పైనే ఫోకస్ పెంచేసింది. ఆల్రెడీ ఎప్పుడో ఒప్పుకున్న పక్కా కమర్షియల్, తిరుచిత్రాంబలం, సర్దార్ వంటి సినిమాలు ఎండింగ్ దశకు వచ్చేశాయి. కొత్త ఆఫర్స్ రాశీని పెద్దగా సౌత్ నుంచి పలకరించట్లేదు. సో హిందీలో సిద్ధార్ధ్ మల్హోత్రా చేస్తోన్న యోధ తర్వాత రాజ్ అండ్ డికె వెబ్ సిరీస్ లో ఆమె ఛాన్స్ దక్కించుకుంది. మరికొంతమంది స్టార్స్ ఆఫర్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇలా సౌత్ సినిమాల పాన్ ఇండియా లెవెల్ లో జెండా ఎగిరేస్తుంటే.. ఇక్కడ గుర్తింపు పొందిన హీరోయిన్స్ మాత్రం బాలీవుడ్ సినిమాలవైపు చూస్తున్నారు.