నిలకడగా బాలు ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల..

SP Balasubrahmanyam Health Update: కరోనా మహమ్మారితో పోరాడుతున్న లెజండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్యానికి సంబంధించి తాజాగా ఎంజీఎం ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
అందులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వెల్లడించింది.
వెంటిలేటర్, ఎక్మో సాయంతోనే ఎస్పీబీకి ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది. వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని తెలిపింది. అలాగే బాలసుబ్రమణ్యంకి ఇస్తున్న ట్రీట్‌మెంట్ గురించి బాలు ఫ్యామిలీకి ఎప్పటికప్పుడు వివరిస్తున్నట్టుగా హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అనురాధా భాస్కరన్ తెలిపారు.
నిన్న మొన్నటి వరకూ ఐసీయూలో ఎక్మో సపోర్ట్‌తో పోరాడుతున్న ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు ప్రకటించడంతో అభిమానులు, కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాలు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా తిరిగి రావాలని అటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు ఇటు సామాన్య జనం సైతం ప్రార్థనలు చేస్తున్నారు.