బాలు ఆరోగ్యం గురించి శుభవార్త చెప్పిన చరణ్..

  • Published By: sekhar ,Published On : August 25, 2020 / 05:46 PM IST
బాలు ఆరోగ్యం గురించి శుభవార్త చెప్పిన చరణ్..

Updated On : August 25, 2020 / 6:40 PM IST

SPB Health Condition: ప్రపంచవ్యాప్తంగా గాన గంధర్వుడు ఎస్.పి. బాలు కోసం చేసిన పూజలు ఫలించాయి. బాలు కోలుకుంటున్నారు. ఈ విషయం స్వయంగా ఆయన తనయుడు చరణ్ వీడియో ద్వారా తెలిపారు. ఎస్.పి. బాలు హాస్పిటల్‌లో జాయిన్ అయినప్పటి నుంచి ప్రతి రోజూ ఆరోగ్యపరిస్థితి గురించి చెబుతూ.. ఎస్.పి. చరణ్ వీడియో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన విడుదల చేసిన వీడియోలో.. తన తండ్రి కోలుకుంటున్నారని, డాక్టర్స్‌కు, వైద్యానికి స్పందిస్తున్నారని తెలిపారు. నిజంగా ఇది బాలూ అభిమానులకు శుభవార్తే.

ఎందుకంటే.. ప్రతి రోజూ ఎస్.పి. బాలు విషయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అందరూ భయపడిపోతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సంగీత ప్రపంచం, బాలు అభిమానులు చేయని పూజలు లేవు. ఇప్పుడా పూజలన్నీ ఫలించి.. ఆయన రికవరీ అవుతున్నట్లుగా చరణ్ పేర్కొన్నారు.

‘‘ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్య పరిస్థితి నార్మల్‌గా ఉంది. 90 శాతం ఐసోలేషన్‌ నుంచి బయటికి వచ్చేశారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు. డాక్టర్స్‌కు అలాగే వైద్యానికి స్పందిస్తున్నారు. నాన్నగారి కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఎంజీఎం హెల్త్ సెంటర్ వారికి కూడా ధన్యవాదాలు. అలాగే నాన్నగారి కోసం ఎంతో శ్రమించిన, శ్రమిస్తున్న డాక్టర్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు…’’ అని చరణ్ ఈ వీడియోలో తెలిపారు.