SP బాలసుబ్రమణ్యం ఇంట్లో విషాదం

హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నివాసంలో విషాదం చోటు చేసుకుంది. బాలుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి శకుంతలమ్మ ఫిబ్రవరి 04వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల 10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. నెల్లూరులోని తిప్పరాజు వారి వీధిలో ఆమె నివాసం ఉంటున్నారు.
కొంతకాలంగా శకుంతలమ్మ అనారోగ్యంతో పాటు వయోభారంతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం బాలు లండన్‌లో ఉన్నారు. విషయం తెలియడంతో ఆయన నెల్లూరు జిల్లాకు పయనమయ్యారు. ఇదిలా ఉంటే బాల సుబ్రమణ్యం సోదరి శైలజ ఫిబ్రవరి 03వ తేదీ ఆదివారమే నెల్లూరు జిల్లాకు వచ్చారు. తల్లి చనిపోవడంతో శైలజ కన్నీరుమున్నీరయ్యారు.