S.P.B. Charan on S.P. Balasubrahmanyam’s health: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు కరోనా నెగిటివ్

  • Published By: sreehari ,Published On : September 7, 2020 / 06:00 PM IST
S.P.B. Charan on S.P. Balasubrahmanyam’s health: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు కరోనా నెగిటివ్

Updated On : September 7, 2020 / 6:18 PM IST

ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నెమ్మదిగా కుదటపడుతోంది.. కరోనా పరీక్షలలో ఆయనకు నెగిటివ్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ తన ఇన్ స్టా ద్వారా స్వయంగా వెల్లడించారు..నాన్న ఆరోగ్యం గురించి వారాంతంలో అప్ డేట్ ఇవ్వలేకపోయినందుకు క్షమించాలి.. గతంతో పోలిస్తే నాన్న ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడిందన్నారు.



డాక్టర్స్ వెంటిలేటర్ తీసేస్తారు అని భావించామని, కొంచెం ఇన్ఫెక్షన్ వుండడంతో తీయలేదని తెలిపారు. ఇందులో సంతోషకరమైన విషయం ఏమిటంటే.. నాన్నకు కరోనా నెగటివ్ అని వచ్చింది.. పాజిటివ్ లేదా నెగటివ్ అన్నది కాదు.. నాన్న ఊపిరితిత్తులు త్వరగా మెరుగు పడాలన్నారు.



నాన్న ఊపిరితిత్తులు మెరుగు అవ్వాలి అంటే కొంచెం టైం పట్టెట్టు ఉందన్నారు.ఆస్పత్రిలో ఎస్పీ బాలు తన ఐ‌ప్యాడ్‌లో క్రికెట్, టెన్నిస్ చూస్తున్నారని, IPL కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారంటూ ఎస్పీ చరణ్ చెప్పారు. ఈ వారాంతంలో అమ్మనాన్నల మ్యారేజీ యానివర్శరీ ఉండటంతో చిన్న సెలబ్రేషన్స్ చేశామన్నారు. ప్రస్తుతానికి ఫిజియథెరపీ కొనసాగుతుందని, నాన్న కోలుకోవాలని ప్రార్థించిన వారికి ధన్యవాదాలు తెలిపారు ఎస్పీ చరణ్..



కరోనా పాజిటివ్ తేలడంతో ఆగస్టు 5న ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు వైద్యులు.. కరోనా పాజిటివ్ కాస్తా నెగటివ్ అని తేలడంతో కుటుంబ సభ్యులతోపాటు ఆయన అభిమానులు, శ్రేయాభిలాషులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) on