వీరశైవ జంగమ సాంప్రదాయంలో బాలు అంత్యక్రియలు

SP Balu funeral: ఐదు దశాబ్దాల పాటు తన గానామృతంతో ప్రేక్షకులను అలరించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలు ఇక లేరు. ఇక రారు ఆయన ఇక పాడరు అని జీర్ణించుకోవడం సంగీత ప్రపంచం వల్ల కావడం లేదు. శనివారం బాలుకు ఎంతో ఇష్టమైన తమిళనాడులోని తామరైపాక్కం ఫామ్‌హౌస్‌లో ఆయన అంత్యక్రియలు ముగిశాయి.
తమిళనాడు ప్రభుత్వం బాలు అంత్యక్రియలను ప్రభుత్వ లాంచనాలతో జరిపించింది. ప్రభుత్వం తరపు నుంచి గౌరవ వందనం సమర్పించి.. గాలిలో తుపాకులు పేల్చి నివాళులు అర్పించింది. అనంతరం ఆయన ఖననం వీర శైవ జంగమ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ సాంప్రదాయం ప్రకారం బాలుని కూర్చొన్న పొజీషన్‌లో ఖననం చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ తరపు నుంచి కొందరు, బాలు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు కొందరు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం అభిమానులను దూరం పెట్టినప్పటికీ.. త్వరలోనే బాలు సమాధిని అద్భుతంగా తీర్చిదిద్ది సందర్శనా స్థలంగా చేయాలనే ఆలోచనలో ఉన్నారు.