బాలు కోసం శబరిమలైలో ప్రత్యేక పూజలు..

  • Published By: sekhar ,Published On : August 22, 2020 / 01:31 PM IST
బాలు కోసం శబరిమలైలో ప్రత్యేక పూజలు..

Updated On : August 22, 2020 / 2:37 PM IST

Special prayers for SPB: గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కరోనా వైర‌స్ కార‌ణంగా గ‌త 15 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. పలువురు నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నామని, ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దేశ వ్యాప్తంగా ఉన్న సంగీతాభిమానులు, సినీ ప్ర‌ముఖులు ఎస్పీబీ కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నారు.



ఎస్పీబీ ఆరోగ్యం మెరుగుప‌డాల‌ని కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌లై ఆల‌యంలో ప్ర‌త్యేక‌మైన పూజ‌లు నిర్వ‌హించారు. దేవ‌స్థానంకు చెందిన క‌ళాకారులు ఉషా పూజతో సంగీత ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. కాగా ఇటీవల బాలు కోలుకోవాలంటూ చిలుకూరు బాలాజీ ఆలయంలోని అర్చకులు కూడా ప్రత్యేక పూజలు చేశారు.