Sree Vishnu: ‘సామజవరగమన’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’ టీజర్ ను ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Sree Vishnu Samajavaragamana Teaser Release Date Locked
Sree Vishnu: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తుండగా, కంప్లీట్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమాను వేసవి కానుకగా మే 18న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
Sree Vishnu: సామజవరగమన.. అంటూ ఫస్ట్ గ్లింప్స్ పట్టుకొస్తున్న శ్రీవిష్ణు!
ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. కాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ టీజర్‌ను ఏప్రిల్ 27న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగ అనౌన్స్ చేసింది. AMB సినిమాస్‌లో ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో శ్రీవిష్ణు పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Sree Vishnu: ప్రేమికుల రోజున శ్రీవిష్ణు నెక్ట్స్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్!
రెబ్బ మోనిక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమాలో నరేశ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమా టీజర్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.