Single : బాక్సాఫీస్ వ‌ద్ద శ్రీ విష్ణు దూకుడు.. మూడు రోజుల్లో సింగిల్ మూవీ ఎంత కొల్ల‌గొట్టిందో తెలుసా?

కార్తీక్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు న‌టించిన చిత్రం సింగిల్.

Single : బాక్సాఫీస్ వ‌ద్ద శ్రీ విష్ణు దూకుడు.. మూడు రోజుల్లో సింగిల్ మూవీ ఎంత కొల్ల‌గొట్టిందో తెలుసా?

Sree Vishnu Single three Days Collections

Updated On : May 12, 2025 / 10:43 AM IST

కార్తీక్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు న‌టించిన చిత్రం సింగిల్. మే 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా, ట్రయాంగిల్ లవ్ స్టోరీతో, కాస్త ఎమోషన్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

జనాలు థియేటర్లకు రావడం లేదు అని అనుకుంటున్న పరిస్థితుల్లో శ్రీ విష్ణు తనదైన కామెడీతో జనాన్ని రప్పించడమే కాదు కోట్లు కొల్లగొడుతున్నాడు. కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్మెంట్ అనే బిరుదు సార్థకం అయ్యేలా చేస్తున్నాడు.

Vishal : విశాల్‌కు ఏమైంది? వేదికపైనే స్పృహ తప్పి ప‌డిపోయిన హీరో.. మేనేజ‌ర్ ఏం చెప్పాడంటే..?

తొలి రోజే 4.15 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించిన సింగిల్ మూవీ. ఇక‌ మూడు రోజుల్లో ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 16.30 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం ఓ పోస్ట‌ర్ ద్వారా సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది.

మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తుండ‌డంతో చిత్ర బృందం ఫుల్ హ్యాపీగా ఉంది. కేతిక శర్మ, ఇవానా క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు.