Vishal : విశాల్‌కు ఏమైంది? వేదికపైనే స్పృహ తప్పి పడిపోయిన హీరో.. మేనేజర్ ఏం చెప్పాడంటే..?
తమిళ స్టార్ హీరో విశాల్ మరోసారి అస్వస్థతకు గురి అయ్యాడు

Actor vishal collapses on stage during beauty pageant for trans women at koovagam
తమిళ స్టార్ హీరో విశాల్ మరోసారి అస్వస్థతకు గురి అయ్యాడు. ఓ ఈవెంట్‌కు హాజరైన విశాల్.. స్టేజీపైనే స్పృహ తప్పి పడిపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమ అభిమాన నటుడికి ఏమైందోనని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
తమిళనాడులోని విల్లుపురం జిల్లా కూవాగంలోని కూత్తాండర్ ఆలయంలో మే 11న (ఆదివారం) రాత్రి ట్రాన్స్ జెండర్ 2025 అందాల పోటీలను నిర్వహించారు. చిత్తిరై వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘మిస్ కూవాగం 2025’ పోటీల కార్యక్రమానికి విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. స్టేజీపై ఉన్న విశాల్ పలువురితో మాట్లాడుతూ కనిపించాడు. అయితే.. ఉన్నట్టుండి ఆయన వేదికపైనే స్పృహ తప్పి పడిపోయాడు.
Balakrishna : వామ్మో బాలయ్యకు అన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారా? రజనీకాంత్ మూవీలో..
கூட்டத்தில் மயங்கி விழுந்த விஷால்… விழுப்புரத்தில் பரபரப்பு#vishal | #thanthicinema | #villupuram pic.twitter.com/DgrXSOv9FU
— Thanthi TV (@ThanthiTV) May 11, 2025
వెంటనే అక్కడ ఉన్న వారు ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. దీంతో ఆయన కాస్త కోలుకున్నాడు. వెంటనే ఆయన్ను అక్కడే ఉన్న మంత్రి పొన్ముడి, ఈవెంట్ నిర్వాహకులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ విశాల్‌కు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
విశాల్ మేనేజర్ ఏం చెప్పారంటే..?
విశాల్ ఆరోగ్యంపై ఆయన మేనేజర్ హరి క్లారిటీ ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం విశాల్ ఆహారం తీసుకోలేదని, కేవలం జ్యూస్ మాత్రమే తాగాడని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఆయన స్పృహ కోల్పోయినట్లుగా తెలిపాడు. సమీపంలోకి ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఆయన క్షేమంగా ఉన్నారన్నాడు. సమయానికి ఆహారం తీసుకోవడం మానేయవద్దని డాక్టర్లు సూచించినట్లు తెలిపారు.
Single : బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న శ్రీ విష్ణు.. సింగిల్ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
కాగా.. ఇటీవల మద గజ రాజా మూవీ ప్రమోషన్స్ సమయంలోనూ విశాల్ చాలా నీరసంగా కనిపించారు. బక్కచిక్కిపోయి, బలహీనంగా వణుకుతూ మాట్లాడారు. దీంతో అప్పట్లో ఆయన ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వచ్చాయి. అయితే.. ఆ సమయంలో విశాల్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడని ఆయన టీమ్ చెప్పింది. ఇక ఇప్పుడు ఇలా జరగడంతో ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు.