Sreeleela : ‘గుంటూరు కారం’ నుంచి శ్రీలీల ఫస్ట్ లుక్ రిలీజ్.. పట్టు పరికిణీలో పదహారణాల తెలుగమ్మాయిలా..
నేడు శ్రీలీల పుట్టిన రోజు కావడంతో తాజాగా చిత్రయూనిట్ శ్రీలీలకు బర్త్ డే విషెష్ చెప్తూ సినిమా నుంచి తన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో శ్రీలీల పట్టు పరికిణి కట్టి కాళ్లకు నైల్ పాలిష్ పెడుతూ క్యూట్ లుక్ తో చూస్తుంది.

Sreeleela First look Released from Guntur Kaaram Movie
Guntur Kaaram : మహేష్ బాబు (Mahesh Babu) త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న SSMB28 ‘గుంటూరు కారం’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల గ్లింప్స్ రిలీజ్ చేయగా మహేష్ మాస్ లుక్ లో అదరగొట్టాడు. దీంతో మహేష్ మాస్ సినిమాతో రాబోతున్నాడని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
నేడు శ్రీలీల పుట్టిన రోజు కావడంతో తాజాగా చిత్రయూనిట్ శ్రీలీలకు బర్త్ డే విషెష్ చెప్తూ సినిమా నుంచి తన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో శ్రీలీల పట్టు పరికిణి కట్టి కాళ్లకు నైల్ పాలిష్ పెడుతూ క్యూట్ లుక్ తో చూస్తుంది. ఈ ఫస్ట్ లుక్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. శ్రీలీల ఎంత క్యూట్ గా ఉందో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అభిమానులు, నెటిజన్లు శ్రీలీలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Adipurush : తెలంగాణలో ఆదిపురుష్ టికెట్ రేట్లు పెంపు.. మొదటి మూడు రోజులు టికెట్ రేట్స్..
గుంటూరు కారం సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్.
Here’s wishing the extremely talented & gorgeous @sreeleela14 a very Happy Birthday! ? – Team #GunturKaaram ??️#HBDSreeLeela ✨
Super ? @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/pPFBZ9EQUf
— Haarika & Hassine Creations (@haarikahassine) June 14, 2023