Sreeleela : వామ్మో.. ‘శ్రీలీల’ ఫ్లోర్ మూమెంట్స్ చూశారా? హీరోలని మించి.. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ నుంచి మరో సాంగ్..

తాజాగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా నుంచి 'ఓలే ఓలే పాపాయి..' అని సాగే ఓ మాస్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

Sreeleela : వామ్మో.. ‘శ్రీలీల’ ఫ్లోర్ మూమెంట్స్ చూశారా? హీరోలని మించి.. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ నుంచి మరో సాంగ్..

Sreeleela Floor Moments in Ole Ole Paapaayi song from Extra Ordinary Man Movie

Updated On : December 4, 2023 / 12:24 PM IST

Sreeleela : టాలీవుడ్ రైటర్ వక్కంతం వంశీ మరోసారి దర్శకుడిగా మారి నితిన్(Nithiin), శ్రీలీల జంటగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’(Extra Ordinary Man). సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పలు సాంగ్స్ రిలీజ్ చేయగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించనున్నాడు. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటూనే మాస్ యాక్షన్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీలో రాజశేఖర్ ఒక ముఖ్య పాత్ర పోషించబోతున్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా నుంచి ‘ఓలే ఓలే పాపాయి..’ అని సాగే ఓ మాస్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ ని హారిస్ జయరాజ్ స్వరపరచగా రామ్ మిర్యాల, ప్రియా హిమేష్ పాడారు. పాట ఫుల్ మాస్ గా తెలంగాణ స్లాంగ్ లో ఉంది. పాట మంచి రీచ్ దక్కించుకుంటుంది. ఇక ఈ పాటలో శ్రీలీల అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్సులు అదరగొట్టేసింది. శ్రీలీల అంటేనే డ్యాన్స్ అని మొదటి సినిమా నుంచి ప్రూవ్ చేసుకుంటుంది. ఇటీవల ఆదికేశవ సినిమాలో అయితే హీరోని డామినేట్ చేసేలా డ్యాన్స్ చేసింది శ్రీలీల. అయితే ఈ సాంగ్ లో శ్రీలీల ఫ్లోర్ మూమెంట్ స్టెప్ వేయడం గమనార్హం. ఇన్నాళ్లు హీరోలు ఫ్లోర్ మూమెంట్స్ తో మెప్పించగా మొదటి సారి హీరోయిన్ ఫ్లోర్ మూమెంట్ వేయడం, అది కూడా శ్రీలీల వేయడంతో ఈ పాట వైరల్ గా మారింది.

Also Read : Yash 19 : హమ్మయ్య.. యశ్ 19 అప్డేట్ వచ్చేసింది.. టైటిల్ అనౌన్స్ అప్పుడే..

ఇప్పుడు కేవలం లిరికల్ సాంగ్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇందులో ఒక్కసారి మాత్రమే శ్రీలీల ఫ్లోర్ మూమెంట్ స్టెప్ చూపిస్తేనే ఇంత వైరల్ గా మారితే ఇక సినిమాలో ఫుల్ సాంగ్ లో శ్రీలీల మళ్ళీ ఏ రేంజ్ లో డ్యాన్స్ వేసిందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా ప్రేక్షకులని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. మొత్తానికి శ్రీలీల మరోసారి ఆమె డ్యాన్స్ తోనే వైరల్ అవుతుంది.