Sreeleela : ఇన్నాళ్లు డ్యాన్స్.. ఇప్పుడు యాక్షన్.. భగవంత్ కేసరిలో బాలయ్యతో కలిసి యాక్షన్ అదరగొట్టిన శ్రీలీల..

తాజాగా బాలకృష్ణతో(Balakrishna) కలిసి భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది శ్రీలీల. అ

Sreeleela : ఇన్నాళ్లు డ్యాన్స్.. ఇప్పుడు యాక్షన్.. భగవంత్ కేసరిలో బాలయ్యతో కలిసి యాక్షన్ అదరగొట్టిన శ్రీలీల..

Sreeleela having great Action Sequence with Balakrishna in Bhagavanth Kesari Movie

Updated On : October 19, 2023 / 1:36 PM IST

Sreeleela :  శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. వరుస హిట్స్ తో, చేతినిండా సినిమాలతో అదరగొడుతుంది. తన డ్యాన్సులతో ఆడియన్స్ ని ఫిదా చేసి, తన యాక్టింగ్ తో మెప్పించి రోజురోజుకి అభిమానుల్ని పెంచుకుంటుంది. తాజాగా బాలకృష్ణతో(Balakrishna) కలిసి భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది శ్రీలీల. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా నేడు అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ సినిమాలో శ్రీలీల బాలకృష్ణ పెంపుడు కూతురిగా విజ్జిపాప అనే పాత్ర చేసింది. ఈ పాత్రలో శ్రీలీల మెప్పించింది. ఓ పక్క బాలయ్యతో ఎమోషనల్ సీన్స్, మరో పక్క డ్యాన్సులు, కాలేజీ అమ్మాయిలాగా అలరించింది. అయితే ఇన్నాళ్లు డ్యాన్సులతో మెప్పించిన శ్రీలీల ఇప్పుడు యాక్షన్ సీన్స్ తో మెప్పించింది. సినిమా క్లైమాక్స్ లో శ్రీలీల కూడా బాలయ్యతో కలిసి ఫైట్స్ చేసింది. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టింది.

Also Read : Bhagavanth Kesari Review : భగవంత్ కేసరి రివ్యూ.. ఈసారి బాలయ్య మాస్ కాదు ఎమోషన్ తో మెసేజ్..

దీంతో మరోసారి ప్రేక్షకులు, అభిమానులు శ్రీలీలను అభినందిస్తున్నారు. ఓ పక్క డ్యాన్సులు, అందం, నటనతో మెప్పిస్తునే ఇప్పుడు యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టింది అంటున్నారు. మరి ఫ్యూచర్ లో ఈ భామ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసినా ఆశ్చర్యపోనవసరంలేదు.