Sreeleela : ఇక అఫీషియల్.. పవన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల.. శరవేగంగా ఉస్తాద్ షూట్..
గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తీస్తున్నాడు. తమిళ్ సూపర్ హిట్ సినిమా 'తేరి'కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Sreeleela plays a major role in Pawan Kalyan Usraad Bhagath Singh Movie
Sreeleela : పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గత కొన్ని రోజులుగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓకే చేసిన సినిమాలన్నిటిని లైన్ లో పెట్టి వరుసగా షూటింగ్స్ కి హాజరవుతున్నారు. 2024 ఎలక్షన్స్(Elections) లోపు ఈ సినిమాలన్నీ ముగించేయాలని పవన్ ఫిక్స్ అయి సినిమాలకు కుదిరినప్పుడల్లా డేట్స్ ఇస్తున్నారు. ఇటీవలే వినోదయ సిత్తం(Vinodaya Sitham) రీమేక్ షూటింగ్ కంప్లీట్ చేసిన పవన్ ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) షూట్స్ లో బిజీగా ఉన్నాడు.
గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తీస్తున్నాడు. తమిళ్ సూపర్ హిట్ సినిమా ‘తేరి’కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. రెండేళ్ల క్రితం సినిమా ప్రకటించినా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఇటీవల ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఆల్రెడీ గతంలోనే పూజాహెగ్డే ఒక హీరోయిన్ అని హరీష్ శంకర్ హింట్ ఇచ్చాడు.
Suhana Khan : హీరోయిన్ అవ్వకముందే యాడ్స్ పట్టేసిన షారుఖ్ కూతురు..
తాజాగా ఈ సినిమాలో శ్రీలీల నటిస్తుందని అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ శ్రీలీల. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. కనీసం పది సినిమాలైనా శ్రీలీల చేతిలో ఉన్నాయి. ఇటీవలే ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శ్రీలీల బాలయ్య, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో పాటు వైష్ణవ తేజ్ లాంటి యువ హీరోలతో కూడా చేస్తోంది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల పవన్ సరసన ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.
శ్రీలీల మంగళవారం(ఏప్రిల్ 10) నాడు ఉస్తాద్ షూటింగ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో నిర్మాతలు, డైరెక్టర్ హరీష్ శంకర్ బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పారు. ఈ ఫోటోని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మేకర్స్ తమ సోషల్ మీడియాలో అధికారికంగా షేర్ చేస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ లోకి శ్రీలీలకు స్వాగతం అని పోస్ట్ చేశారు. అయితే కొంతమంది మాత్రం ఆ అమ్మాయి చాలా చిన్న పిల్ల పవన్ పక్కన మరీ చిన్న పిల్లలాగా ఉంటుంది, ఆ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ప్రజెంట్ టాలీవుడ్ లక్కీ చామ్ శ్రీలీల ఈ సినిమాలో ఉందంటే సినిమాకి ఇంకొంచెం ప్లస్ అవుతుంది అని అంటున్నారు. మొత్తానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోలందరితో వరుస పెట్టి నటించేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
Welcoming the young sensation @sreeleela14 on board for #UstaadBhagatSingh ❤️@PawanKalyan @harish2you @ThisIsDSP @DoP_Bose #AnandSai @UBSTheFilm pic.twitter.com/Pkl2ilPRO0
— Mythri Movie Makers (@MythriOfficial) April 11, 2023