Papam Pasivadu Teaser : కన్‌ఫ్యూజన్‌కు కేరాఫ్‌ అడ్రస్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

సింగ‌ర్‌గా, హోస్ట్‌గా టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీరామ‌చంద్ర (Sreerama Chandra). ఆయ‌న పాపం ప‌సివాడు (Papam Pasivadu) అనే వెబ్‌సిరీస్‌లో న‌టిస్తున్నారు.

Papam Pasivadu Teaser : కన్‌ఫ్యూజన్‌కు కేరాఫ్‌ అడ్రస్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Pasivadu Teaser

Updated On : September 4, 2023 / 8:47 PM IST

Papam Pasivadu : సింగ‌ర్‌గా, హోస్ట్‌గా టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీరామ‌చంద్ర (Sreerama Chandra). ఆయ‌న పాపం ప‌సివాడు (Papam Pasivadu) అనే వెబ్‌సిరీస్‌లో న‌టిస్తున్నారు. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఇది రూపుదిద్దుకుంటోంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ల‌లిత్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌లో రాశీ సింగ్, గాయత్రి చాగంటి, శ్రీ విద్యా మహర్షి కీలక పాత్రలు పోషిస్తున్నారు. జోస్ జిమ్మి సంగీతాన్ని అందించ‌గా, ది వీకెండ్‌ షో పతాకంపై అఖిలేష్‌ వర్థన్‌ నిర్మిస్తున్నారు.

Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు పై పవన్ కళ్యాణ్‌కి ఇంటరెస్ట్ లేదు.. ఏ ఎం రత్నం జవాబు..

సెప్టెంబ‌ర్ 29 నుంచి ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ నేప‌థ్యంలో టీజ‌ర్‌ను విడుదల చేశారు. ఇత‌డి పేరు క్రాంతి కన్‌ఫ్యూజన్‌ ఎక్కువ. క్లారిటీ అయితే చాలా తక్కువ అంటూ వాయిస్ ఓవ‌ర్‌తో మొద‌లైన టీజ‌ర్ ఆద్యంతం అల‌రించింది. క్రాంతి అనే కంప్లీట్ కన్ఫ్యూజన్ క్యారెక్ట‌ర్ ను శ్రీరామచంద్ర చేస్తున్నాడు. ప్ర‌తి విష‌యంలోనూ అత‌డు కన్ఫ్యూజ్ అవుతుంటాడు. క్రాంతి ఓ అమ్మాయిని చూసి ఇష్టపడ‌తాడు. అయితే మరో అమ్మాయి ఇత‌డిని ఇష్టపడుతుంది. ఇక్క‌డ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఇద్దరినీ కాదని మ‌రో అమ్మాయి వచ్చి చచ్చినా నేనే నచ్చానని చెప్పాలంటూ తుపాకీతో బెదిరించడం వంటివి ఆక‌ట్టుకున్నాయి.

Bigg Boss 7 : బిగ్ బాస్ 7 ఫస్ట్ డే ప్రోమో వచ్చేసింది.. అప్పుడే లవ్ ట్రాక్ షురూ.. ఎవరో తెలుసా..?