Sreerama Chandra : సింగర్ ఆల్సో.. డ్యాన్సర్ ఆల్సో అంటున్న శ్రీరామచంద్ర
ఇండియన్ ఐడల్ సీజన్ 5 విన్నర్‌గా నేషనల్ టెలివిజన్‌పై కనిపించిన శ్రీరామచంద్ర మరోసారి 'ఝలక్ దిఖ్లా జా రియాలిటీ షో'తో దూసుకుపోతున్నారు. ఈరోజు జగరబోయే షోలో తనకు ఓటు వేయమంటూ శ్రీరామచంద్ర రిక్వెస్ట్ చేస్తున్నారు.

Sreerama Chandra
Sreerama Chandra : సింగర్ శ్రీరామ చంద్ర గాయకుడు మాత్రమే కాదు ‘ఝలక్ దిఖ్లా జా రియాలిటీ షో’ సీజన్ 11 స్టార్ కూడా అయిపోయారు. డాన్స్ పట్ల తనకున్న మక్కువతో ఈ షోలో ఎంట్రీ ఇచ్చారు. 28వ తేదీ రాత్రి జరగబోయే షోలో తనకు ఓటు వేయమంటూ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు శ్రీరామచంద్ర.
శ్రీరామచంద్ర ఇండియన్ ఐడల్ సీజన్ 5 విజేత అని అందరికీ తెలుసు. బాలీవుడ్‌లో సుభాన్ అల్లా, బల్మా, అల్లా దోహై వంటి పాటలు పాడారు. సౌత్‌లో కూడా తన సత్తా చాటుకున్నారు. గెలుపు తలుపులే, అటు ఇటు ఊగుతూ, మరీ అంతగా, ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. ఇలా తెలుగులో చాలానే పాటలు పాడారు. ఇప్పటిరవకు 9 భాషల్లో 500 పైగానే పాటలు పాడిన శ్రీరామచంద్ర ‘పాపం పసివాడు’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించారు. ఝలక్ దిఖ్లా జా డాన్స్ షోతో మళ్లీ నేషనల్ టెలివిజన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు శ్రీరామచంద్ర.
Santhanam : అందరూ మా అప్పుల గురించి ఆరా తీస్తారు.. స్టార్ కమెడియన్ వ్యాఖ్యలు వైరల్
మైఖేల్ జాక్సన్‌ను ఎంతగానో ఆరాధించే శ్రీరామచంద్రకి హిప్-హాప్ డాన్స్ అంటే చాలా ఇష్టమట. ప్రస్తుతం షోలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రొఫెషనల్ డాన్సర్లతో శ్రీరామచంద్ర తలపడుతున్నారు. సింగర్‌గానే కాకుండా డాన్సర్‌గా కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న శ్రీరామచంద్ర 28వ తేదీ శుక్రవారం రాత్రి జరగబోయే షోలో తనకు ఓట్ చేయమంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ఓటింగ్ టైమ్స్‌తో పాటు పూర్తి వివరాలను పోస్టులో ఎక్స్‌ప్లైన్ చేశారు. సింగర్ గానే కాకుండా మంచి డాన్సర్‌గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న శ్రీరామచంద్రకి ఓటింగ్ బాగా రావాలని ఆశిద్దాం.
View this post on Instagram