Santhanam : అందరూ మా అప్పుల గురించి ఆరా తీస్తారు.. స్టార్ కమెడియన్ వ్యాఖ్యలు వైరల్
తమిళ స్టార్ కమెడియన్ హీరోగా నటిస్తున్న 'వడక్కుపుట్టి రామస్వామి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్‌గా చెన్నైలో జరిగింది. ఈ సందర్భంలో సంతానం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Santhanam
Santhanam : తమిళనాట స్టార్ కమెడియన్ సంతానం తాజా సినిమా ‘వడక్కుపుట్టి రామస్వామి’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. లేటెస్ట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సంతానం తను.. తన స్నేహితుడు ప్రముఖ నటుడు ఆర్య అప్పుల గురించి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.
Animal : యానిమల్‌లో నాన్న సెంటిమెంట్.. నాన్న అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో గమనించారా?
కమెడియన్ టర్న్‌డ్ హీరో సంతానంకి తమిళంలో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిబ్రవరి 2న సంతానం కొత్త సినిమా ‘వడక్కుపుట్టి రామస్వామి’ రిలీజ్ అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా నిర్మిస్తోంది. ఇందులో మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజైన పోస్టర్లు, టీజర్లకు మంచి స్పందన కూడా వచ్చింది. రీసెంట్‌గా చెన్నైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో ఆర్య గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంలో సంతానం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Robert De Niro : 79ఏళ్ళ వయసులో తండ్రి అవ్వడంపై.. ఆస్కార్ నటుడు రియాక్షన్..
ఆర్య తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చినందుకు సంతోషంగా ఉందంటూనే సంతానం తమ అప్పుల గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. ఆర్య, సంతానం మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. సంతానం ఎక్కడికి వెళ్లినా ఆర్య గురించి, ఆర్య ఎక్కడికి వెళ్లినా సంతానం గురించి అడుగుతారట..అదేదో వారి క్షేమ సమాచారాల కోసం అనుకునేరు. వారిద్దరూ చేసిన అప్పుల గురించి అడుగుతారట. వార్నీ.. ఇంత పెద్ద స్టార్ కమెడియన్‌కి అప్పులేంటా? అని అందరికీ అనుమానం రావచ్చు. సంతానం సంగతేమో కానీ ఆర్యపై గతంలో అప్పులు తీసుకుని ఎగ్గొట్టాడని ఆరోపణలు ఉన్నాయట. ఇక సినిమా విషయానికి వస్తే వడక్కుపుట్టి రామస్వామి సినిమా కార్తీక్ యోగీ డైరెక్ట్ చేస్తున్నారు. ఎంఎస్ భాస్కర్, కూల్ జయంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.