Peddha Kapu 1 : రా అండ్ రస్టిక్‌గా పెదకాపు-1 ట్రైలర్.. శ్రీకాంత్ అడ్డాల అదరగొట్టేశాడు..

శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న పెదకాపు-1 ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పూర్తి రా అండ్ రస్టిక్‌గా మూవీని..

Peddha Kapu 1 : రా అండ్ రస్టిక్‌గా పెదకాపు-1 ట్రైలర్.. శ్రీకాంత్ అడ్డాల అదరగొట్టేశాడు..

Srikanth Addala Virat Karrna Peddha Kapu 1 trailer released

Updated On : September 11, 2023 / 3:30 PM IST

Peddha Kapu 1 : టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. వెంకటేష్ తో ‘నారప్ప’ వంటి మాస్ మూవీని తీసి ఆడియన్స్ ని ఆశ్చర్య పరిచాడు. తాజాగా ‘పెద్ద కాపు’ అనే మరో యాక్షన్ మూవీతో ప్రేక్షకులను మరోసారి థ్రిల్ కి గురి చేయనున్నాడు. కొత్త కుర్రాడు ‘విరాట్ కర్ణ’ని ఈ సినిమాతో హీరోగా పరిచయం చేయబోతున్నాడు. న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్‌ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ మూవీని రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు. పెదకాపు-1 చిత్రాన్ని సెప్టెంబర్ 29న రిలీజ్ చేయబోతున్నారు.

Jigarthanda DoubleX : ‘జిగర్‌తండా డబుల్ ఎక్స్’ టీజర్ ని రిలీజ్ చేసిన మహేష్ బాబు.. ఫుల్ యాక్షన్‌తో..

ఇక రిలీజ్ దగ్గర పడుతుండడంతో.. తాజాగా మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే.. శ్రీకాంత్ అడ్డాల సినిమాని పూర్తి రా అండ్ రస్టిక్ గా తెరకెక్కించాడని అర్ధమవుతుంది. మూవీ స్టోరీ ఒక ఊరిలోని పాలిటిక్స్, కమ్యూనిటీ గొడవల చుట్టూ తిరుగుతుందని అర్ధమవుతుంది. ఈ సినిమాలో విలన్ గా శ్రీకాంత్ అడ్డాలే కనిపించబోతున్నాడు. హీరోగా కనిపించబోతున్న విరాట్ కర్ణ.. ట్రైలర్ లో తన నటనతో ఆకట్టుకున్నాడు. మరి పూర్తి సినిమాలో ఎలా మెప్పిస్తాడో చూడాలి.

Lavanya Tripathi : పెళ్ళికి ముందు ఆ హీరోతో లావణ్య త్రిపాఠి వెబ్ సిరీస్.. చేస్తుందా?

కాగా ఈ మూవీ నుంచి ఇటీవల ఒక సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటిస్తుండగా రావు రమేష్, నాగబాబు, తనికెళ్ళ భరణి, రాజీవ్ కనకాల, బ్రిగడ సగ, అనసూయ, ఈశ్వరి రావు, నరేన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరి శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాతో ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.