Lavanya Tripathi : పెళ్ళికి ముందు ఆ హీరోతో లావణ్య త్రిపాఠి వెబ్ సిరీస్.. చేస్తుందా?

వరుణ్ తో నిశ్చితార్థం అవ్వకముందే ఒప్పుకున్న సిరీస్. మరి ఇప్పుడు ఈ సిరీస్ చేస్తుందా? లేక సిరీస్ కి నో చెప్తుందా అని టాక్ నడుస్తుంది.

Lavanya Tripathi : పెళ్ళికి ముందు ఆ హీరోతో లావణ్య త్రిపాఠి వెబ్ సిరీస్.. చేస్తుందా?

Lavanya Tripathi Web Series with Bigg Boss Fame Abijeet before Marriage with Varun Tej

Updated On : September 11, 2023 / 8:09 AM IST

Lavanya Tripathi :  హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో మెగా కోడలు కానున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది. ఇటీవలే వీరిద్దరికి నిశ్చితార్థం కాగా త్వరలోనే వీరి పెళ్లి ఉండబోతుందని తెలుస్తుంది. దీంతో కాబోయే మెగా కోడలు కావడంతో లావణ్య మీద అభిమానుల్లో, నెటిజన్లలో ఫోకస్ ఎక్కువే ఉంది.

లావణ్య చివరిసారిగా తెలుగులో హ్యాపీ బర్త్ డే అనే సినిమాలో కనిపించింది. తమిళ్ లో ఒక సినిమా నిర్మాణం అయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. ఇక లావణ్య పలు వెబ్ సిరీస్ లు కూడా చేసింది. ఇటీవలే పులి మేక అనే సిరీస్ లో పోలీసాఫీసర్ గా కనిపించింది లావణ్య. అయితే లావణ్య చేతిలో మరో వెబ్ సిరీస్ కూడా ఉంది.

Yash : భార్యా పిల్లలతో సముద్రం బీచ్ వద్ద ఎంజాయ్ చేస్తున్న యశ్.. నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇమ్మని ఫ్యాన్స్..

నటుడు, బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్(Abijeet) కి జంటగా డిస్నీప్లస్ హాట్ స్టార్ లో ఒక సిరీస్ ఓకే అయింది. ఈ సిరీస్ విశ్వక్ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సిరీస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని సమాచారం. ఇది వరుణ్ తో నిశ్చితార్థం అవ్వకముందే ఒప్పుకున్న సిరీస్. మరి ఇప్పుడు ఈ సిరీస్ చేస్తుందా? లేక సిరీస్ కి నో చెప్తుందా అని టాక్ నడుస్తుంది. కొంతమంది త్వరలోనే పెళ్లి కాబట్టి ఇప్పుడు రొమాంటిక్ సిరీస్ లు చేయదు, నో చెప్తుంది అని కామెంట్స్ చేస్తుండగా మరి కొంతమంది పెళ్ళికి ముందే షూటింగ్ పూర్తిచేసేస్తుంది అని అంటున్నారు. మరి ఈ సిరీస్ పరిస్థితి ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.