Jigarthanda DoubleX : ‘జిగర్‌తండా డబుల్ ఎక్స్’ టీజర్ ని రిలీజ్ చేసిన మహేష్ బాబు.. ఫుల్ యాక్షన్‌తో..

2014లో వచ్చిన ‘జిగర్‌తండా’ సినిమాకి దర్శకుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ ప్రీక్వెల్ గా 'జిగర్‌తండా డబుల్ ఎక్స్' తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ టీజర్ ని మహేష్ బాబు రిలీజ్ చేశాడు.

Jigarthanda DoubleX : ‘జిగర్‌తండా డబుల్ ఎక్స్’ టీజర్ ని రిలీజ్ చేసిన మహేష్ బాబు.. ఫుల్ యాక్షన్‌తో..

Mahesh Babu Releases Raghava Lawrence SJ Suryah Jigarthanda DoubleX teaser

Updated On : September 11, 2023 / 3:10 PM IST

Jigarthanda DoubleX : 2014లో సిద్దార్ధ, బాబీ సింహ, లక్ష్మి మీనన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ తెరకెక్కించిన తమిళ సినిమా ‘జిగర్‌తండా’. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా రెండు జాతీయ అవార్డులను కూడా అందుకుంది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేశారు. తెలుగులో ఈ సినిమాని హరీష్ శంకర్.. వరుణ్ తేజ్ తో ‘గద్దలకొండ గణేష్’గా రీమేక్ చేశాడు. ఇక ఇప్పుడు ఆ చిత్రానికి డైరెక్టర్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ప్రీక్వెల్ ని తీసుకు వస్తున్నాడు.

Shah Rukh Khan Jawan Review: ‘జవాన్’ సినిమాకు రివ్యూ ఇచ్చిన క్రికెటర్ దినేష్ కార్తీక్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన షారూక్ ఖాన్

ఇక ఈ ప్రీక్వెల్ లో రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ ప్రీక్వెల్ కి ‘జిగర్‌తండా డబుల్ ఎక్స్’ అనే టైటిల్ ని పెట్టారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఫస్ట్ పార్ట్ అన్ని భాషల్లో రీమేక్ అయ్యి మంచి విజయం సాధించడంతో.. ఈసారి ప్రీక్వెల్ ని డైరెక్ట్ గా అన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.

Sound Party Song : వీజీ సన్నీ ‘సౌండ్ పార్టీ’ ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో సాంగ్ రిలీజ్.. ట్రెండింగ్ లో వైర‌ల్ అవుతోన్న సాంగ్..

ఈక్రమంలోనే ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈక్రమంలోనే మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. తెలుగు టీజర్ ని సూపర్‌స్టార్ మహేష్ చేతుల మీదుగా విడుదల చేశారు. టీజర్ మొత్తం ఫుల్ యాక్షన్ తో నిండిపోయింది. రాఘ‌వ లారెన్స్‌ గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తే, ఎస్‌.జె.సూర్య ఫిలిం మేకర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మూవీలో ఆసక్తిని రేపే ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ చాలా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.